ఛాయా చిత్రం (11)

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (2)

‘లేపాక్షి’ చాలా అందమైన పేరు. ఈ పేరుకు సంబంధించి రామాయణం, జటాయు కథ ప్రచారంలో వున్నది తెలిసినదే!

‘లేపాక్షి’ రెండు పదాల కలయికవలన ఏర్పడిన పదం. ‘లేప’ అనీ, ‘అక్షి’ అనీ ఆ రెండు పదాలు. నేను అర్ధంచేసుకున్నంతలో ఈ రెండు పదాలకు విడివిడిగా ‘లేపనము (చే అలంకృతాలయిన)’ ‘కన్నులు కల (స్త్రీ)’ అని ఒక అర్ధం. ఇంకాస్త పరిశీలనగా ఆలోచించి అన్వయిస్తే ‘కన్నులే లేపనముగా కలిగిన (ప్రదేశం)’ అన్న అర్ధం కూడా ‘లేపాక్షి’ అన్న పదానికి అమరుతుంది అని నేననుకుంటాను. ఈ రెండవ అర్ధం – ముఖ్యంగా కొన్ని పరిస్థితుల ప్రభావం వలన ఈ దేవాలయ నిర్మాణానికి ముఖ్య కారకుడుగా చెప్పుకుంటూన్న విరూపణ్ణ
అనబడే ఆనాటి ఒక రాజోద్యోగి తన కనులను తానుగానే పెరికి ఈ దేవాలయం గోడ మీదికి విసిరేయడం, ఆ ఘటన తాలూకు ఆనవాళ్ళు ఇప్పటికీ ఈ దేవాలయం  గోడమీద మిగిలి వున్నవిగా చూపబడుతూండడం (మనం నమ్మ గలిగినా, నమ్మ లేకపోయినా) – అన్న కథకు సరిగా సరిపోతుందని నేనను అనుకుంటాను!

ఏదేమైనా, ‘లేపాక్షి ‘ చాలా అందమైన పేరు. ఈ పేరును మొట్టమొదటగా ఊహించి ఈ ప్రదేశాన్ని పిలిచిన వ్యక్తి ఎవరోగాని, అతనికి ఈ ఆలయ నిర్మాణంతో తప్పకుండా సంబంధం వుండి వుంటుందని నేను నమ్ముతాను. సౌందర్యాన్ని కనులు మిరుమిట్లుగొలిపేలా కాకుండా, గుప్తంగా, subdued గా మలచగలగడానికి, చూపగలగడానికి ఒకరకమైన పరిణతి చెందిన మనస్సుకావాలి. నది తన సహజమైన స్థితిలో నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది, ఉరకలూ పరుగులూ యెత్తదు. సౌందర్యమూ అంతే, సహజమైన స్థితిలో
ఉరకలూ పరుగులూ యెత్తదు, subdued గానే వుంటుంది అన్నది లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలో మలచబడిన ప్రతి రాయీ చెబుతుంది.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం వెలుపలి, లోపలి ప్రాకారాల మధ్య విశాలంగా వదిలివేయ బడిన ఖాళీ ప్రదేశంలోనూ, స్తంభాల వసారాలోని నిశ్శబ్దంలోనూ ఇలాంటి సౌందర్యమే మలచబడి కనిపిస్తుంది!

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : స్తంభాల వసార

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : వెలుపలి, లోపలి ప్రాకారల మధ్య ప్రదేశం (1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : వెలుపలి, లోపలి ప్రాకారల మధ్య ప్రదేశం (2)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం స్తంభాల వసార - మరో కోణం

ప్రకటనలు

2 thoughts on “ఛాయా చిత్రం (11)

  1. అద్భుతంగా ఉంది. పక్కనే ఉన్నా ఇన్ని యేళ్ళవరకూ లేపాక్షి చూడకపోవడం కాస్త సిగ్గుగా ఉంది. ఈ సారి తప్పక చూడాలి.

    వీలైతే తాడిపత్రి చింతలవెంకటరమణస్వామి దేవాలయం, అలూరుకోన, హైమావతి, కంబదూరులో మల్లేశ్వర స్వామి దేవళం, పెనుగొండ ఇవన్నీ చూసి వీటి గురించీ వ్రాయండి. (ఇవన్నీ కూడానూ రాయలవారి కాలం నాటివే)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s