మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (6)

“సదాశివమూర్తి”

లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలోని అసంపూర్తి కళ్యాణ మండపంలో, సదాశివుడిది ఒక విలక్షణమైన శిల్పంగా పెద్దలు చెబుతారు. సదాశివమూర్తి ప్రతిమ మరే యితర విజయనగర రాజుల కాలపు ఆలయాలలోనూ కనుపించదనీ, లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలోని సదాశివమూర్తి ప్రతిమ అన్నివిధాలా అత్యుత్తమమైనదని కూడా చెబుతారు.

విశేషమేమంటే, సదాశివమూర్తి ప్రతిమ రెండు రూపాలలో ఈ అసంపూర్తి కళ్యాణ మండపంలోని రెండు స్తంభాలపై చెక్కబడి దర్శన మిస్తుంది. ఒక స్తంభంపై ఐదు ముఖాలూ, పది చేతులతోనూ, వేరొక స్తంభంపైన మూడు ముఖాలూ, నాలుగు చేతులతోనూ తీర్చబడి కనుపిస్తుంది. మూడు ముఖాలున్న సదాశివమూర్తి ప్రతిమ మధ్య ముఖంలో మూడవ కన్ను లీలగా తీర్చబడి కనిపిస్తుంది.

Hindu iconography పరిభాషలో స్వామి యొక్క ఈ మూర్తులను వర్ణించేటపుడు, ‘సమపాద స్థానక ‘ అనే మాటలను పెద్దలు  వాడతారు.  ‘స్వామి రెండు పాదాలూ భూమి మీద స్థిరంగా వుంచి నిలబడి వున్న’ అని ఈ మాటల అర్ధం, స్వామి అలంకరణను వర్ణించేటపుడు వాడే మాటలు (Hindu iconography పరిభాషలోనే!) గ్రైవేయకాలు (మెడను కట్టుకునే సొమ్ములు),స్కందమాలలు (భుజ కీర్తులు), ఉదరబంధం,
వనమాల (a garland, పూదండ), పూర్ణోరుకం (అనేక మడతలలో సంపూర్ణంగా, అందంగా చుట్టబడిన వస్త్రం), కడియాలు, మేఖల, ఇత్యాది.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం - పంచముఖ సదాశివమూర్తి చిత్రం (1)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం - పంచముఖ సదాశివమూర్తి చిత్రం (2)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం - త్రిముఖ సదాశివమూర్తి చిత్రం (1) (పక్కన విష్ణుమూర్తి)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం - త్రిముఖ సదాశివమూర్తి చిత్రం (2) - (పక్కన విష్ణుమూర్తి)

 

ప్రకటనలు

2 thoughts on “మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (6)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s