మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (5)

‘లేపాక్షి’  ఒకసారి జ్ఞాపకంలోకి విచ్చేస్తే అంత తొందరగా వదిలి వెళ్ళదు. మిగతావి ఏవైనా సరే విడిచి పెట్టి, దృష్టి అటువేపు మళ్ళించాలిసిందే…at least నాకు!

అసంపూర్తి కళ్యాణ మండపం అందరికీ తెలియగూడని, తెలిసికోవడానికి ప్రయత్నం చేయ్యకూడనిదిగా మిగిలిపోయిన ఒక రహస్యం లాంటిది. కొన్ని అలా రహస్యాలుగా మిగిలిపోవడమే మంచిది! తిలుసుకోవడానికి ప్రయత్నించడంలో తప్పులేదుగాని, ఒక వేళ అది తెలిస్తే, ఆ తెలిసింతరువాత తెలిసింది మిగిల్చే ఆనందం కన్నా, రహస్యం రహస్యంగానే వుండి, ఎవరికి వాళ్ళు ఈ రహస్యం ఏమై వుంటుందో అనుకుంటూ వాళ్ళ వాళ్ళ imaginations లోకి కొంతసేపైనా వెళ్ళిపోగలిగే సుఖాన్ని పోగొట్టుకోవడమనే దుఃఖం భరింపరానిదిగా తయారవుతుంది అనిపిస్తుంది!

I think any work of art should leave some scope for individual’s imagination! మొనాలిసా నవ్వు లాగా! అప్పుడది విధవిధాలయిన interpretations కి అవకాశం కల్పించినదై, కాలంలో నిలుస్తుంది. ఎందుకంటే, interpretations అనేవి ఒక రొజుతో ఆగేవి కాదు కాబట్టి!

అసంపూర్తి కళ్యాణ మండపంలోని స్తంభాలపై చెక్కి వున్న పూలు, లతలు మొదలైన డిజైన్లు తీర్చి వుండి మనసుకు ఆహ్లాదాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి.

అసంపూర్తి కళ్యాణ మండపంలోని స్తంభాలు

అలాగే, ఆలయం చుట్టు వున్న స్తంభాల వసారాలో వరుస స్తంభాలపై చెక్కబడి వున్న బొమ్మలన్నీ చూసేవాళ్ళ మనసులకు ఆనందాన్ని కలిగించేవే! స్తంభాల వసారాలో ముఖ్యంగా కంటిని ఆకర్షించే ఇంకో అంశం – బయటి వెలుతురు వసారాలోపలి స్తంభాల మధ్య దాక్కుని వున్న చీకటితో ఆడుకునే ఆట!

వసారాలోపలి స్తంభాల మధ్య చీకటి వెలుగులు

ప్రకటనలు

8 thoughts on “మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (5)

 1. >>> కొన్ని అలా రహస్యాలుగా మిగిలిపోవడమే మంచిది

  అందుకేనేమో నండీ, ఆ పై వాడు రహస్యం గానే ఉండి పోతున్నాడు కాలాతీతం గా .

  చీర్స్
  జిలేబి.

  • మీ interpretation బాగుంది. వ్రాసేటప్పుడు నేనంత దూరం ఆలో
   చించ లేదు. works of art వరకే ఆలోచించాను. ఇప్పటి మీ వ్యాఖ్య తరువాత, may be HE is the ultimate work of art!! అవవచ్చేమో అనిపిస్తుంది.:)

   వ్యాఖ్య కు ధన్యవాదాలు!

 2. >>>may be HE is the ultimate work of art

  చాలా బాగా చెప్పారండీ రావు గారు,- Not May be, but He is, for if He is not then there could not have been a reflection of that Art in the Human which is nothing but reflection of Himself in the above Art and sculptures of Golden period of India/

  “తమీషానం జగతస్తస్తుషస్పతిం ” – ఆనో భద్రా సూక్తం లో అనుకుంటాను!

  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s