మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (7)

అష్టదిక్పాలకులు

ఇంద్రుడు

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కల్యాణమండపం స్తంభాలపై మలచబడి వున్న ప్రతిమలలో, అష్టదిక్పాలకురలో ఒకరైన ఇంద్రుని ప్రతిమ ముఖ్యమైనది.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఎనిమిది దిక్కులనూ ఎనిమిది మంది ప్రధాన దేవతలు పరిపాలిస్తూ వాటికి అధిపతులుగా వుంటారు.  ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. ఇంద్రుడు దేవతల రాజు. ఇంద్రుని చేతిలో వుండే వజ్రాయుధానికి అమేయమైన శక్తి వుంది.  ఇంద్రుని గొప్పదనం గురించి ఋగ్వేదంలో విస్తారంగా చెప్పబడి వుంది.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణ మండపంలోని ఇంద్రుని ప్రతిమకు కొన్ని ప్రత్యేకలున్నాయి. అన్ని హంగులతో చాలా అందంగా తీర్చబడి వున్న ఇంద్రుని ప్రతిమకు, నొసటన నిలువుగా మూడవ కన్ను చెక్కబడి వుండడం అనేది గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైనది సంగతి. ఇలా చూపబడడం చాల అరుదని పెద్దలు చెబుతారు. ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత,  మొత్తం నాలుగు చేతులతో వున్న ప్రతిమలో, పై రెండు చేతులలోనూ వజ్రాయుధాన్ని ధరించి వున్నట్లుగా చూపడం.  ఇలా చూపబడిన ఇంద్రుని ప్రతిమలు కూడా చాల అరుదని చెబుతారు. ఇకపోతే, అతి ముఖ్యమైనదీ, లేపాక్షిలోని ఇంద్రుని ప్రతిమకే చాలా చాలా ప్రత్యేకమైన అంశం – ఇంద్రుని శరీరంపై నేత్రాలను చెక్కి వుండడం (అహల్య సంబంధమైన కథ అందరికీ తెలిసినదే కదా!). ఇది ప్రతిమ వంక కాస్త పరిశీలనగా చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి ప్రతిమలు కూడా చాలా చాలా అరుదని, భారతదేశంలో ఇలాంటి ఇంద్రుని ప్రతిమ మరెక్కడైనా వున్నదా?  అంటే సందేహమే! అనీ చెబుతారు.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : ఇంద్రుని ప్రతిమ - చిత్రం (1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : ఇంద్రుని ప్రతిమ - చిత్రం (2)

ప్రకటనలు

12 thoughts on “మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (7)

  1. ఎంతో చక్కని విశ్లేషణ. మీ బ్లాగు చదివినప్పుడల్లా నాకు ఒక క్రొత్త అనుభూతి. శిల్పకళ మీద మీకున్న జిజ్ఞాస అమోఘం. ఎన్నో నేర్చుకోవచ్చు మీ బ్లాగు నించి. కొన్నింటికి చదివినా వ్యాఖ్యానించలేని ఆనందం.

    • రసజ్ఞ, చాలా పొగడ్త కురిపించేశారు ఈ బ్లాగు మీద! ధన్యవాదాలు! ఇప్పుడిప్పుడే ఈ బ్లాగు purpose నేరవేరడం మొదలవుతోందనుకుంటున్నాను! A perfect informative and వీలయినంతలో educational బ్లాగ్ గా ఈ బ్లాగుని వృధ్ధి చేయాలని నా కోరిక!

      మీ వ్యాఖ్యకు మరోసారి ధన్యవాదాలు!

  2. లేపాక్షి గురించి నా వ్యాససంపుటిలో ఒక పుస్తకంలో రాసి వున్నాను.కొండూరి వీరరాఘవాచార్యులు ఒక పుస్తకమే వ్రాసారు.లేపాక్షి నంది(బసవయ్య)చాలా పెద్దది ,ప్రసిద్ధి పొందింది.కుడ్య చిత్రాలు ఉండే కొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి.

  3. నేను వొక రోజుగా బయటి ప్రపంచంతో సంబంధాలు అన్ని విధాలా తెగిపోవడం మూలంగా ఆలస్యంగా చూసాను. అద్భుతాన్ని ఆవిష్కరించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s