మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (9)

అష్టదిక్పాలకులు

ఈశాన్యుడు

దక్షిణ భారతదేశంలో గానీ, ఉత్తర భారతదేశంలోగానీ ఈ దిక్పాలుని ప్రతిమలు చాలా తక్కువగా కనబడతాయి. దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తి, శ్రీశైలం మొదలైన ప్రదేశాలలో వున్న విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన ఆలయాలలో ఈ దిక్పాలుని ప్రతిమలున్నాయని చెబుతారు.

పురాణాలు, ఆగమాలలో చెప్పిన సంగతుల ప్రకారం, ఈశాన్యుడు గౌరీశ్వరుడని, శిరస్సుపై అర్ధచంద్రుడు, నాగ యజ్ఞోపవీతం, రత్న కుండలాలు, చేతులు అభయ వరద ముద్రలలోనూ, దక్షిణ హస్తంలో శూలం, వామ హస్తంలో కపాలం, మూడు కన్నులు, తెల్లటి దుస్తులలో వుండి వాహనమైన ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లుగా వుంటాడు.

లేపాక్షి, శ్రీ వీరభద్రాలయం – అసంపూర్తి కళ్యాణమండపంలోని స్థంభంపై మలచబడిన ఈశాన్యుని ప్రతిమ చాలా అందమైనది. నాలుగు చేతులుండి, పైనున్న చేతులలో పరశు, త్రిశూలం ధరించి వుండి, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి. ఈ స్వామి, అందమైన ఆభరణాలతో అలంకరింపబడి కనిపిస్తాడు.

ఈశాన్యుడి వాహనమైన నంది, ఈశాన్యుడి ప్రతిమకు క్రిందిభాగాన ఫలకంపై మలచబడి కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : ఈశాన్యుడు (photo-1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : ఈశాన్యుడు (photo-2)

ప్రకటనలు

2 thoughts on “మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (9)

    • శర్మగారూ ధన్యవాదాలు!
      నేను సేకరించగలిగినంతలో, బ్లాగు పోస్టుగా వ్రాయగలిగినంతలో సామాచారాన్ని సేకరించి రాస్తున్నాను. విలువైనదిగా మీకు అనిపించినందుకు, మీరు దానిని వ్యాఖ్యగా తెలియజేసినందుకు మరోసారి ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s