మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (10)

అష్టదిక్పాలకులు

కుబేరుడు

కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. పురాణాలలో యక్షులకు రాజుగానూ, మహాదేవునికి స్నేహితునిగానూ, అలకాపురికి ప్రభువుగానూ చెప్పారు.  ఈయన భార్య పేరు వృధ్ధి. ఈయన వాహనం నరుడని, మేషమనీ, గాడిద అనీ రకరకాలుగా చెప్పబడింది. లేపాక్షి ప్రతిమలో మాత్రం ఇవేవీ కాకుండా అశ్వాన్ని ఈయన వాహనంగా చూపారు. ఇది ప్రత్యేకత, ఆసక్తిని రేకెత్తించే విషయం.

లేపాక్షిలోని కుబేరుని ప్రతిమ చాలా అందంగా తీర్చబడింది. నాలుగు చేతులు, పై రెండు చేతులలో గద, ఖడ్గం వుండి, క్రింది రెండు చేతులూ అభయ, వరద ముద్రలలో వున్నట్లుగా మలచబడి వుంది.  కుబేరునిది కుండ లాంటి పొట్ట అని కూడా చెబుతారు.  లేపాక్షి ప్రతిమలో మాత్రం అలా కనపడదు. అందమైన రూపంతో వుంటుంది ప్రతిమ. ప్రతిమ క్రిందిభాగాన ఫలకంపై అందంగా మలచబడిన అశ్వం, పైకి లేచి వున్న ముందరి కాలుతో ముందుకు పరుగెడుతున్నట్లుగా కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : కుబేరుడు (photo-1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : కుబేరుడు (photo-2)

 

ప్రకటనలు

6 thoughts on “మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (10)

 1. చాలా విలువయిన విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తూ అలరిస్తున్నారు. నేను కుబేరుని భార్య పేరు చిత్ర రేఖి అని విన్నాను. అలానే లేపాక్షి ప్రతిమలో చూపినట్టు ఈయన వాహనం అశ్వం అనే విన్నాను. మరి ఏది వాస్తవమో మీరే చెప్పాలి!

  • రసజ్ఞ!
   కుబేరుని భార్య పేరు చిత్ర రేఖ, వాహనం – అశ్వం, ఈ రెండూ మీరు చెప్పినవి సరైనవే! అయితే, కొన్ని పురాణాలు, ఆగమాలు వేరే వేరేగా చెప్పిన సంగతులు, నేనీ పోస్టుల కోసం short notes తయారు చేసుకునే క్రమంలో చదివినవి వున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తి కరమైన సంగతులివి – కుబేరునికి ఇద్దరు భార్యలు – విభావ, వృధ్ధి అన్నవి వారి పేర్లు; వాహనం – మనిషి, మేషము, గాడిద, అశ్వము. అలాగే, కుబేరుడు వైశ్రణ, ధనేశ, ధనేశ్వర అనే పేర్లతో కూడా పిలవబడినాడని చదివాను. బహుశా చోళ, చాళుక్య, విజయనగర రాజుల కాలంనాటికి కుబేరుని వాహనం అశ్వంగా స్థిరపడిపోయిందనుకుంటాను. భార్య అయిన చిత్ర రేఖ విషయంలో, ఆమె కుబేరుని భార్య అన్నది తప్ప వేరే సమాచారం నాకు తెలియదు, ఎక్కడా చదవలేదు ఇంతవరకూ!

   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

 2. మంచి విలువైన సమాచారం. దేవాలయాలను ఇంత ఆసక్తిగా చూచి వర్ణించడం చాలా అరుదు. ఈ వ్యాసాలను సంకలనపరచి, మరిన్ని విశేషాలతో పుస్తకంగా కూరిస్తే కూడా అందంగా ఉంటుంది. ధన్యవాదాలు.

  • కొంత నా మనసులో మాటనే చెప్పారు, రవిగారూ! ఒకటి రెండు sources నుంచి సేకరించిన సమాచారంతో, నేను తీసిన photographs తో, blog format కి అనుగుణంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. పూర్తి స్థాయి సమాచారంతో, ఇంకా మంచి exclusive angles తో వున్న photographs తో, ద్విభాషా (తెలుగు, ఆంగ్లం) పుస్తకంగా present చేయాలని కోరిక! ఎప్పటికో అవుతుంది!

   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s