మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (11)

అష్టదిక్పాలకులు

యముడు

యముడు దక్షిణ దిక్కుకు అధిపతి. యమలోకాధిపతి కూడా! ప్రతి ప్రాణి యొక్క పాప పుణ్యాలను తరచి చూసి శిక్షవేసి అమలు జరిపే ధర్మ దేవత ఈయన! ఈ లక్షణమే, ధర్మమే, ఈయనకు మిగతా దేవతల కంటే భిన్నంగా (సౌమ్యంకాని) ఉగ్రమైన, కించిత్ భయంకరమైన రూపాన్ని ఇచ్చింది అనిపిస్తుంది.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం – అసంపూర్తి కళ్యాణ మండపంలో దక్షిణ దిక్కున యముని ప్రతిమ వుంది. ఈ ప్రతిమలో యముడు రౌద్రుడుగా, పెద్ద పెద్దవిగా విప్పార్చుకున్న కనులతోనూ, గుండ్రని కనుబొమలతోనూ మలచబడి కనిపిస్తాడు. నాలుగు చేతులు – పై చేతులలో గద, పాశం, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి. అన్ని ఆభరణాలతో అలంకరించబడి వున్న ఈ ప్రతిమ, అసంపూర్తిగా మిగిలి వుందన్న భావనను కలగజేస్తుందని చెబుతారు.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలోని యముని ప్రతిమలో ముఖ్యంగా గమనించాల్సినది – కళ్ళు, ముఖం రౌద్రంగా మలచబడినా, ఆయన కున్న నాలుగు చేతులలో క్రింది రెండు చేతులూ అభయ, వరద ముద్రలలో మలచబడి వుండడం అనీ, చేతులు ఇలా అభయ, వరద ముద్రలలో వున్న యముని ప్రతిమలు చాలా అరుదనీ పెద్దలు చేబుతారు. విజయనగర రాజుల కాలపు దేవాలయాలలో కుడా, లేపాక్షిలో వున్నటువంటి యముని ప్రతిమ ఎక్కడా లేదని కూడా చెబుతారు.

దృష్టిని ఆకర్షించే ఇంకొక సంగతి ఏమిటంటే, యముని ప్రతిమ యజ్ఞోపవీతంతో అలంకరింపబడి కనపడదు. ఈ కారణంగానే ఈ ప్రతిమ అసంపూర్తిగా మిగిలివుందన్న భావనను కలగజేస్తుందేమోనని అనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : యముడు (photo-1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : యముడు (photo-2)

 

 

ప్రకటనలు

6 thoughts on “మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (11)

    • పరిశీలన పెద్దలచే ఇంతకుముందే చేయబడింది శర్మగారూ! నేను ఇప్పుడు చేస్తున్నదల్లా, (మరుగున పడి వున్న) ఆ సమాచారాన్ని సేకరించి, అందులో అతి ముఖ్యమైనదిగా నాకు తోచిన దానిని బ్లాగు పోస్టులకు సరిపోయే రీతిలో క్రోడీకరించి, నేను తీసిన ఫోటోలతో దేనిది దానికి జతచేసి present చేయడమే! అందువలన, దీనిలో అసలు credit అంతా పెద్దలకే దక్కుతుంది. వారు పూజ్యులు! వారిలో (‘లేపాక్షి’ కి సంబంధించినంత వరకు) అతి ముఖ్యులు గౌ.లు. సి.పూర్ణచందు గారు. వారు రాసిన పుస్తకం ‘లేపాక్షి – వాస్తు శిల్ప చిత్రలేఖనాలు’ లో ‘లేపాక్షి’ గురించిన సమగ్రమైన సమాచారం వుంది. అయితే ఈ పుస్తకం ఇప్పుడు print లో దొరకదనుకుంటాను. చాలా విషయాలకు లాగానే, ‘లేపాక్షి’ విషయంలో కూడా సమాచార లేమి అన్నది సమస్య కాదు. ఉన్న సమాచారం అందుబాటులో లేకపోవడమే కొంత సమస్య అనుకుంటాను. ఆ సమాచారాన్ని, నేటి కాలానికి తగినట్లుగా fast food లాగా plate లో పెట్టి serve చేయడమే నేను చేస్తున్నది…అంతమాత్రమే!

      ఎప్పటికప్పుడు మీ వ్యాఖ్యలతో అభినందనలు తెలియజేస్తున్న మీకు, మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s