హొయసలుల దేవాలయం, శిల్పకళ (1)

హొయసల శిల్పం అనగానే ముందు స్ఫురణకు వచ్చేది ‘detail’; శిల్పంలో చిన్న చిన్న సంగతులను సైతం వాళ్ళు పలికించిన తీరు, చూపించడానికి వాళ్ళు తీసుకున్న శ్రధ్ధ (పడిన కష్టం ఎంతో? మరి మనకైతే ఇప్పుడు తెలీదు, ఊహించనూలేం!). దేవాలయంలోని ఏ భాగాన్నయినా సరే, శిల్పాన్నయినా సరే, వాళ్ళు కాయితం మీద drawing లాగా చెక్కి చూపించడానికి ఉబలాట పడ్డారు, కృతకృత్యులయ్యారు కూడా! రాతిపై చెయ్యి, చేతిలోని ఉలి అంత precision తో ఎలా తిరిగిందో, ఎలా తిప్పడం సాధ్యమయిందో దేముడికే తెలియాలి అన్నట్లుగా వుంటాయి వారు చెక్కి చూపించిన ప్రతిమలు!

ఆలయ నిర్మాణంలో హొయసలులు అవలంబించిన ఒక పధ్ధతి ఏమిటంటే, ప్రధాన ఆలయానికి ప్రవేశ ద్వారాలు ఎన్నివైపుల వున్నా కూడా, అన్ని వైపులా ప్రవేశ ద్వారానికి దారి తీసే మెట్లకి ఇరు వైపులా చిన్న చిన్న ద్వారపాలక/ద్వారపాలిక ఆలయాలను నిర్మించడం, అందులో అంతే శ్రధ్ధతోనూ, సంగతులతోనూ తీర్చబడిన ద్వారపాలక ప్రతిమలను వుంచడం. బేలూరు శ్రీ చేన్నకేశవాలయంలో ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఈ చిన్న ఆలయాలలో వుంచబడిన ద్వారపాలక/ద్వారపాలిక ప్రతిమలు కూడా అత్యంత నైపుణ్యవంతంగా తీర్చబడి కనిపిస్తాయి. బేలూరు శ్రీ చెన్నకేశవాలయం ప్రధాన ఆలయం ప్రధాన ద్వారనికి దారితీసే మెట్లకు ఇరువైపులా వున్న ద్వారపాలక ఆలయాలలో వున్న ప్రతిమలు శైవ సాంప్రదాయంలోనివి. మిగిలిన ద్వారాలకు వున్న ద్వారపాలక ఆలయాలలోనివి వైష్ణవ సాంప్రదాయంలోనివి. ప్రతిమలను చూడంగానే సులభంగా ఈ సంగతి గుర్తించడానికి వీలవుతుంది.

హొయసల శిల్పం -1 (బేలూరు)

హొయసల శిల్పం -2 (బేలూరు)

హొయసల శిల్పం -3 (బేలూరు)

హొయసల శిల్పం -4(బేలూరు)

‘ఎల్లవేళలా సంతోషంగా వుండడానికి ప్రయత్నించండి, (మన) లోపలి సంతోషానికీ, inner peace కీ సూచకంగా చిరునవ్వును పెదవులమీదనుంచి తొలగనివ్వకండి!’ అని ఇప్పటి art of living భాషణల్లో పదే పదే చెప్పబడుతున్న మాట! ఈ భాషణల్లో, ఈ సూత్రం ఇప్పటి కాలపు ఆధునిక జీవితంలోని ఒడిదుడుకులను సమర్ధవంతంగా తట్టుకోవడానికి కొత్తగా కనిపెట్టబడినది అన్నట్లుగా అర్ధం స్ఫురిస్తూ వుంటుంది గానీ, నిజానికి ఈ management సూత్రం మనకు ముందునించీ వున్నదే! ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పరిస్థితులు అప్పడులేని కారణంగా  అది అలా unspoken గా వుండిపోయింది. ఇప్పుడు ఘర్షణతో కూడుకున్న అలాంటి పరిస్థితులు వున్నాయి కాబట్టి, outspoken గా పదే పదే వక్కాణించబడుతోంది.

రాతిమీద ప్రతిమనుకూడా  ముడుచుకుని వున్న పెదవులతోనూ, నవ్వు విలసిల్లని ముఖ కవళికతోనూ మలిచి చూపించడానికి హొయసలులు ఇష్టపడలేదని చెప్పడానికి వారిచే నిర్మించబడిన దేవాలయాలలో చాలా నిదర్శనాలు దొరుకుతాయి. పెదవులపై కనుపించీ కనుపించకుండా వుండే నవ్వు లేని ప్రతిమ, వారి శిల్పాలలో చాలా అరుదు. ఉగ్ర రూపంలో వున్న శివాంశతో వున్న  పురుష, స్త్రీ ప్రతిమలలోనూ, ఉగ్ర నరశింహ అవతార ప్రతిమలలోనూ తప్ప, చిరునవ్వుతో లేని ప్రతిమలు హొయసలుల శిల్పాలలో సాధారణంగా  కనుపించవు. కనుపించీ కనుపించకుండా వుండే ‘పెదవుల చివరి పైవైపుకి వంపు’ శిల్పానికి ఎక్కడలేని శాంతిని, చిద్విలాసాన్నీ ప్రసాదిస్తుంది అనడానికి ఈ క్రింది ఫొటోలలొ కనుపించే శిల్ప ప్రతిమలు కొన్ని ఉదాహరణలు.

హొయసల శిల్పం - 5 (సోమనాథపూర్)

హొయసల శిల్పం -6 (సోమనాథపూర్)

హొయసల శిల్పం - 7 (హాళేబీడు)

వైవిధ్యం, అంటే ఒకే ప్రతిమను వివిధ భంగిమలలో, ఒక ప్రతిమతో వేరొక ప్రతిమకు ఎటువంటి పోలికా లేకుండా, ఎంత నైపుణ్యంతో నయితే మలచి చూపించారో, అంతే నైపుణ్యంతో ఒక ప్రతిమను అచ్చు గుద్దినట్లు అదే పోలికలతో పక్క పక్కనే మలచి చూపించారు హొయసల శిల్పులు. ఈ క్రింది ఫోటోలలోని మొదటి ఫోటోలో, పక్క పక్కనే మలచబడి వున్న మువ్వురు స్త్రీ ప్రతిమలలో ఏ ప్రతిమకూ మరొక ప్రతిమతో ఏ పోలికా లేక పోవడాన్ని గమనించవచ్చు. అలాగే, రెండవ ఫోటోలో, ఆసీనులైవున్న ‘విష్ణుమూర్తి శ్రీ లక్ష్మి’ ప్రతిమలకు ఇవువైపులా వింజామరలతో నిలబడివున్న స్త్రీ ప్రతిమలు, ఒక ప్రతిమకు వేరొకటి అచ్చు గుద్దినట్లు అదే పోలికతో మలచబడి వుండడమూ చూడవచ్చు.

హొయసల శిల్పం -8 (బేలూరు)

హొయసల శిల్పం -9 (బేలూరు)

 

 

ప్రకటనలు

6 thoughts on “హొయసలుల దేవాలయం, శిల్పకళ (1)

  1. వెంకట్ గారూ,
    చాలా బాగుందండీ వీరి శిల్పకళ, మీరు చెప్పిన తీరూ! అసలు నేను మొదట మీ బ్లాగుకి వచ్చినదే ఈ హోయసలుల గురించి చూసి అని నా నమ్మకం! మీరు ఇంతక ముందు దీని గురించి వ్రాశారు కదూ! అప్పుడు నేను ర్యాలీ జగన్మోహినీ కేశవ స్వామి గురించి చెప్పినట్టు గుర్తు! ఈ సారి ప్రభల తీర్థానికి మా ఊరు వస్తే ఆ గుడిని కూడా చూపిస్తాను!

    • అవును, మీ జ్ఞాపకాలు కరక్టే! ఇంతకు మునుపు ‘హోయసలుల దేవాలయం’ అని 3-4 భాగాల series వ్రాశాను. అప్పుడు వారి దేవాలయ నిర్మాణ పధ్ధతులను ఒక broader level లో ప్రస్తుతిస్తూ ఆ పోస్టులు వ్రాయడం జరిగింది. ఇప్పుడు వారి శిల్పాన్ని గురించి కొంత విశదంగానూ, అందులో నేనుగా గమనించిన కొన్ని సంగతులను తెలియజేస్తూ ఈ పోస్టులు వ్రాయడం జరుగుతోంది. ఎంతలేదన్నా, ఇంకా పది పోస్టులకు సరిపడా material వుంది. అయితే, ఇదే అంశంపై అన్ని పోస్టులు ఇక్కడ వరసగా వ్రాయడం కష్టం. అందుచేత, ఇంకా రెండు-మూడు భాగాలలో నేను ముఖ్యంగా గమనించిన అంశాలను గురించి తెలుపుతూ ఈ series ముగుస్తుంది.

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు! తప్పకుండా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s