హొయసలుల దేవాలయం, శిల్పకళ (2)

శిల్పానికి ఆకృతిని ఇవ్వడంలో హొయసల శిల్పులు దేవతా మూర్తుల రూపాలకు చిన్న చిన్న మార్పులు కల్పించి చూపడానికి ఎప్పుడూ వెరవలేదనిపిస్తుంది, వారిచే నిర్మించ బడిన దేవాలయాలలోని కొన్ని దేవతా ప్రతిమలను చూసినప్పుడు! సాధారణంగా విష్ణువు మూర్తిని శేషుని తల్పంగా చేసుకుని శయనించి వున్నట్లుగా చూపించడమే మనం చూస్తాం! అయితే, సొమనాథపూర్ లోని చెన్నకేశవాలయం గోడపై వెలుపలివైపు మలచబడిన శిల్పంలో విష్ణుమూర్తిని శేషునిపై కూర్చుని వున్నట్లుగా మలచబడి వుండడం చుస్తాం! ఇదే దేవాలయం గోడలపై మలచబడిన విష్ణు ప్రతిమలలో విష్ణుమూర్తి శ్రీలక్ష్మి సమేతంగా కూర్చునివున్న ప్రతిమనూ, విష్ణుమూర్తి ఒక్కడుగానే నిలుచుని వున్న ప్రతిమలనుగూడా చూడవచ్చు. అత్యంత సుందరంగా మలచబడిన ఈ ప్రతిమలలోని కొన్ని వివరాలు కాలానికి చెదిరిపోయి కనుపించకుండా పోవడం కొంత బాధను కలిగించే అంశం!

Hoyasala sculpture -10 (Somanathpur)

హొయసల శిల్పం – 10 (సోమనాథపూర్)

Hoyasala sculpture - 11 (Somanathpur)

హొయసల శిల్పం – 11 (సోమనాథపూర్)

Hoyasala sculpture -12 (Somanathpur)

హొయసల శిల్పం – 12 (సోమనాథపూర్)

విష్ణుమూర్తి ప్రతిమలో శంఖ చక్రాలను, మూర్తికి కుడివైపు చేతులలోని ఒక చేతిలోనూ (చక్రం), ఎడమవైపు చేతులలోని ఒక చేతిలోనూ (శంఖం) మలచబడి వుండడాన్ని సాధారణంగా చూస్తాం! ఇది సంప్రదాయకంగా వస్తూన్న సంగతి. అయితే, హాళేబీడు హొయసలేశ్వర దేవాలయం గోడపై మలచబడి వున్న ఒక విష్ణుమూర్తి ప్రతిమలో (ఈ క్రింది ఫోటోలో) శంఖ చక్రాలను రెండింటినీ ఒకేవైపున్న చేతులలో (ఇక్కడ మూర్తికి ఎడమ వైపున్న చేతులలో) మలచబడి కనిపిస్తాయి. ఇది ఇప్పుడు చూడడానికీ, చెప్పడానికీ ‘ఇదేముంది? అటువైపు మలచాల్సింది, ఇటువైపు మలిచారు, అంతేగా!’ అనిపించవచ్చు. కానీ, ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించే ప్రథాన శిల్పాచార్యునికి దృష్టిలో ఇది అంత స్వల్ప విషయం కాదు. సంప్రదాయంగా వస్తూన్న సంగతిని వీడి వెళ్ళడం, అంటే సంప్రదాయానికి విరుధ్ధంగా వెళ్ళడం, break చేయడం, అంత చిన్న విషయాలేమీ కావు. అయినా ఇక్కడ అలా మలచబడి కనిపిస్తుందంటే, దానికి అర్ధం ‘హొయసల శిల్పులు చిన్న చిన్న మార్పులు చేయడానికి, కల్పనలను చేయడానికీ తగిన స్వాతంత్ర్యం ఇవ్వబడినారనీ! Sculptors of this period, the Hoyasala period, had been given ample freedom to think a bit differently, freedom to imagine a bit differently and freedom to execute a bit differently!’ అని అర్ధం. వారు మలచి చూపించిన శిల్పాకృతులలాగా, వారికి ఈయబడిన ఈ స్వేఛ్ఛను వారు అంతే అందంగా వినియోగించుకున్నారన్నది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం!

Hoyasala sculpture - 13 (Halebidu)

హొయసల శిల్పం – 13 (హాళేబీడు)

పై ఫొటోలోని ప్రతిమలలో ఇంకొక విశేషం వుంది. విష్ణుమూర్తి ప్రతిమకు కుడి వైపున వున్న శివుని ప్రతిమలో, శివునికి ఎడమవైపు చేతులలోని ఒక చేతిలో ‘మొక్కజొన్న పొత్తు’ (cob) ని మలచి చూపడం జరిగింది. ఇది కూడా హొయసల శిల్పుల అందమైన కల్పనకూ, imagination కీ, ఒక ఉదాహరణగా నేను భావిస్తాను!

హొయసల శిల్పుల శిల్పాలలోని స్త్రీ ప్రతిమలలో ఈ ‘మొక్కజొన్న పొత్తు’ (cob) విశేషంగా కనిపిస్తుంది. దీనిని వారు స్త్రీ ప్రతిమలలో bountiness of food, bountiness of reproductive capacity అనేవి చూపడానికీ, symbolic గా తెలియజేయడానికి ఉద్దేశించినవని పెద్దలు చెబుతారు. అంతవరకూ బాగానే వుంది. అయితే ఇది ఇక్కడ శివుని ప్రతిమలో ఎందుకు ప్రత్యక్షమైంది? అనేది ప్రశ్న. దానికి నేను వూహించుకున్న సమాధానం ఇది. శివుడు అర్ధనారీశ్వరుడు.  ఆయనలో సగ భాగం, అంటే వామ భాగం (ఎడమ సగం) పార్వతీ దేవి అన్నది అందరకూ తెలిసినదే! ఇక్కడ, శివుని అర్ధనారీశ్వరునిగా మలచక పోయినా, ఆయనలో సగం ఎప్పటికీ (ఆయన పురుషాకృతిలో కనిపిస్తున్నప్పటికీ కూడా) పార్వతీ దేవి అని చెప్పడానికి సూచకంగా, ఈ శివుని ప్రతిమలోని ఎడమవైపు చేతులలోని ఒక చేతిలో ఈ ‘మొక్కజొన్న పొత్తు’ (cob) అలంకరించబడి మలచబడింది అని నేను అనుకుంటాను. ఇది కూడా ఈ ప్రతిమను మలచిన శిల్పి ఊహా శక్తికీ, అందమైన కల్పనకూ ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తాను!

ప్రకటనలు

2 thoughts on “హొయసలుల దేవాలయం, శిల్పకళ (2)

  1. ఏదో శిల్పాలని చూసి బాగుంది, అద్భుతంగా చెక్కారు అనుకోవటం తప్ప ఇంత సూక్ష్మంగా ఎప్పుడూ గమనించలేదు. ఇకనించి ఈ దృష్టితో చూడాలి! చక్కని విషయాలని ఎంతో ఓపికగా తెలియచేస్తున్న మీకు జోహార్లు!

    • ఆసక్తి వున్న అంశాలను మరికాస్త పరిశీలనగా చూడడం అన్నది అలవాటు చేసుకుంటే, సంగతులను ఇంకా బాగా అనుభూతి చెందవచ్చు, అభినందించ వచ్చు! ఒకింత అదృష్టం తోడుంటే, కొత్త సంగతులను కనుగొని లోకానికి తెలియజేయనూ వచ్చు!!

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s