చంద్రగిరి!

చంద్రగిరి! చిత్తూరు జిల్లాలో –  ప్రపంచ ప్రసిధ్ధి చెందిన పుణ్య క్షేత్రం, ఆంధ్రుల ఇల వేలుపు, అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలిచే దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ధామం అయిన – తిరుపతి కి 11 కి.మీ. దూరంలో వున్న ఊరు! ఈ ఊరి పేరు వినగానే ఆంధ్రుల చరిత్రలో జగజ్జగేయమానంగా వెలిగిన  విజయనగర సామ్రాజ్యం, ఆ వెంటనే శ్రీ కృష్ణదేవరాయలు, ఆ వెనువెంటనే ఆయనకు పితృసమానుడూ, గురువు అయిన తిమ్మరుసు గుర్తుకు రావడం మామూలే! తిమ్మరుసయ్య ఇక్కడే పుట్టి, విద్యాబుధ్ధులు నేర్చి అంతవాడయ్యాడని ఐతిహ్యం! కృష్ణదేవరాయలు తిరుపతి యాత్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేసేవాడని చెబుతారు.

ఇక్కడ ఇప్పుడు చూడడానికి ఒక రాజమహలు, రాణీ మహలూ ఉన్నాయి. రాజ మహలు మూడు అంతస్తులలోనూ, రాణీ మహలు రెండు అంతస్తులలోనూ ఉంటాయి. రాజ మహలులోనే ఆర్కియాలనీ డిపార్టుమెంటువారు నిర్వహిస్తూన్న మ్యూజియం వుంది.

ఇవి కాక, వీటికి దగ్గరలోనే రోడ్డుకు ఇవతలి వైపున, ఎప్పటిదో… ఇప్పుడు పాడుబడిపోయిన స్థితిలో వున్న ఒక చిన్న దేవాలయము కనిపిస్తుంది. ఎప్పటినుంచి ఈ దేవాలయం ఈ స్థితిలో వుందో తెలీదు.

ఇవి అన్నీ కలిసి వున్న ఒక slide show ఇప్పుడు, ఇక్కడ!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు

12 thoughts on “చంద్రగిరి!

  • మీ నిర్ణయానికి సంతోషం, భాస్కరరామిరెడ్డిగారూ! పురావస్తు శాఖ వారు నిర్వహిస్తూన్న ‘మ్యూజియం’ కూడా చాలా informative గానూ, interestingగానూ వుంటుంది. వీలుచూసుకుని వెళ్ళి చూడండి. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

 1. రావు గారు,

  చాలా అపురూపం గా ఫోటో తీసారు. పర్యాటక డిపార్ట్మెంటు వారు కూడా ఇంత అందం గా దీనికి కూర్పు చేసినట్టు చూడలేదు ఎక్కడా ! హాట్స్ ఆఫ్ !

  చీర్స్
  జిలేబి.

  • ఓకే…ఓకే! 🙂 ముందున్నవి ఇంకా మంచి రోజులన్నట్లుగా, మంచి మంచి చాలా ప్రదేశాలను చూసే రోజులు మీకు ఇంకా ముందున్నాయన్న మాట! Hope for the best!!

   వ్యాఖ్యకు ధన్యవాదాలు!

 2. రావుగారూ,
  ఫొటోలూ, మీ కూర్పూ బాగున్నాయి. చాలా కాలం క్రిందట ఒక సారి బస్సులో వస్తూ, రోడ్డుపక్కనే ఎందుకో ఆగిపోవలసి వచ్చింది చాలసేపు. దూరంగా పెద్ద కొండ అక్కడ ఏదో ఉన్నట్టు కనిపిస్తే ఏమిటని అడిగేను. అక్కడ వాళ్ళెవరూ చెప్పలేకపోయారు. స్థల ప్రాశస్థ్యం స్థానికులకు తెలియకపోవడం విచారకరం. తిమ్మరుసు ఇక్కడే పుట్టేడని తర్వాత తెలిసింది. మీ వ్యాఖ్యతో అది రూఢి అయింది.
  మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు.

  • ధన్యవాదాలు, ‘sunamu’ మూర్తిగారూ! మీరన్నట్లు స్థానీయాలైన సంగతులను అక్కడివాళ్లే మరిచిపోవడం బాధాకరమే! స్థలపురాణాలన్నవి ఒక తరంనుంచి ఇంకో తరానికి నోటి కథల ద్వారా వ్యాప్తి చెందిన ఆసక్తి కరమైన సంగతులు! అయితే, ఇప్పుడు రెండు తరాలకి చెందిన మనుషులు ఒకే గూటి క్రింద వుండే రోజులు పోతూండడం వలన, కథలూ వాటిని అంటిపెట్టుకుని ఉన్న సంగతులూ కూడా మెల్ల మెల్లగా మాయమౌతున్నాయి!

  • ధన్యవాదాలు, శర్మగారూ! మీరు అనారోగ్యాన్నించి కోలుకుని మళ్ళీ కంప్యూటరు ముందు కూర్చున్నారు…అదే మహా సంతోషం!!

   ‘కోడెనాగు’ సినిమాలోని ఈ పాటను నా వ్యాఖ్యానంలో కూడా mention చేద్దామనుకున్నాను! కానీ ఎందుకో చెయ్యలేదు! ఇప్పుడు మీరు మీ వ్యాఖ్యలో ప్రస్తావించి నేను అసంపూర్తిగా వదిలేసినది మీరు పూర్తి చేశారు, బాగుంది!

   ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s