ప్రాకృతికం!

ప్రకృతి, విశ్వంలోని ప్రాణులన్నిటికీ పుట్టిన దగ్గరనుంచీ మనుగడ సజావుగా సాగడానికి ఏఏ ప్రాణికి ఎంతెంత జ్ఞానం అవసరమో అంతా వాటివాటి పుట్టుకతోనే ఇచ్చింది. సృష్టిలో అతి సూక్ష్మ జీవి, ఏకకణ జీవి అయిన అమీబా దగ్గరనుంచి, అన్ని రకాల పశుపక్ష్యాదులూ, క్రిమికీటకాదులు, చెట్టుచేమలతో సహా అంతరంగికంగా, అవ్యక్తంగా వున్న ఈ ఎవరూ బొధించ నవసరంలేని, ఎవరి దగ్గరా నేర్చుకోనవసరంలేని  ప్రత్యేకమైన జ్ఞానంతో బ్రతకడమెలాగో తెలుసుకుని, బ్రతుకుతూ వుంటాయి. వాటికి కావలసిన ఆహారాన్ని అవి తెచ్చుకుంటుంటాయి, ఆపదలను అదో జ్ఞానంతో పసిగట్టి వాటినవే కాపాడుకుంటూ జీవనం సాగిస్తూ వుంటాయి. అలా బ్రదుకుతూనే, ఏదో తెలియని కాంక్షతో వాటి వాటి రకం ప్రాణులు ప్రకృతిలో లుప్తమై పోకుండా, వాటినవే వృధ్ధి చేసుకుంటూ గూడా వుంటాయి. ఇదిలా ఇందులో ఎవరి ప్రమేయమూ లేదన్నట్లుగానే సాగిపోతూ వుంటుంది. దీనిని సూక్ష్మంగా ‘సృష్టి క్రమం’ అని పెద్దలు అంటారు. ఈ క్రమం ఇలా కొనసాగుతూ వుంటుంది!

కొన్నాళ్ల క్రితం ఒక కందిరీగ, మరెక్కడా దానికి అనువైన ప్రదేశం దోరకలేదన్నట్లు,  మేము నివాసముంటున్న ఇంటి బాల్కనీ గోడ జాఇంటులో ఒక అంగుళం మేర స్థలాన్ని చూసుకుని గూడు కట్టుకోవడం మొదలెట్టింది.  కందిరీగలు తడి మట్టితో గూడు కట్టుకుంటాయి. ఎక్కడినుంచో తడి బురద మట్టిని తీసుకువచ్చి, దానికి సహజంగానే ఆంతరంగికంగా వున్న పరిజ్ఞానంతో గూడు కట్టడం మొదలెట్టింది. దానికిక వేరే ప్రపంచంతో పని లేదన్నట్లుగా తదేక దీక్షతో ఆ మట్టి గూడు నిర్మాణం చేసే కార్యక్రమంలో మునిగిపోయింది. ఎక్కడి నుంచో ఒక ప్రదేశాన్నించి తడి మట్టిని చిన్న చిన్న పరిమాణాలలో తేవడం, తెచ్చిన మట్టిని చెయ్యి తిరిగిన తాపీ మేస్త్రీ లాగా దానికి కావలసిన ఆకారంలో సర్ధుబాటు చేయడం, తెచ్చిన మట్టి సర్దడం అయిపోగానే మళ్ళి వెళ్ళడం…ఇదిలా కొంత సేపు కొనసాగింది – కొన్ని ఫోటోలూ, ఒక వీడియో తీసుకునేదాకా!

ఆ ఫోటోలు slide show లాగా….. ఇప్పుడు, ఇక్కడ!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు