పర్యాటకం – నంది హిల్స్, మాగడి

బెంగుళూరు నుంచి ఒకరోజులో వెళ్ళి చూసి రాగలిగిన పర్యాటక ప్రదేశాలలో నందిహిల్స్, మాగడి అనే ప్రదేశాలు రెండు. వీటిలో నందిహిల్స్ బెంగుళూరుకు 60 కి.మీ. దూరంలో వుంటుంది. చాలా ప్రసిధ్ధి చెందిన tourist destinations లో ఒకటి. టిప్పు సుల్తానుకు ఇది వేసవి కాలపు విడిదిగా వుండేదట! నంది దుర్గమని కూడా దీనికి పేరుందని తెలిసింది. కొండ పైనుంచి చుట్టూ scenery చూడడానికి చాలా బాగుంటుంది. పైన garden చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన నృసింహస్వామివారి దేవాలయం ఇక్కడ వుంది. ఈ రోజులకు తగినట్లుగా అన్ని రకాల సదుపాయాలూ పైన వున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఒక రోజు, మధ్యలో ఏమీ boredom feel అవకుండా, చాలా కాలక్షేపంగా గడిచి పోతుంది ఇక్కడ!

మాగడి అనే ఊరు బెంగుళూరుకు 40-45 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఊరు బెంగుళూరు వ్యవస్థాపకుడూ, నిర్మాత అయిన ‘కెంపె గౌడ’ కి కొంత కాలం headquarters లాగా వుండినదని చెబుతారు. ఈ ఊరి చుట్టూ ‘కెంపె గౌడ’ చేత నిర్మించబదిన కోటగోడ శిథిలాలు వూరులోకి ప్రవేశిస్తూండంగానే కనిపిస్తాయి. మాగడి లో శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం ప్రసిధ్ధి చెందినది. లోపల పూజలందుకుంటున్న దేవుడు – శ్రీనివాసుడు. ప్రతి సంవత్సరం ఏప్రెల్ నెలలో స్వామి వారి తిరునాళ్ళ, ఉత్సవాలు జరుగుతాయట! శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ గోపురం చూడడానికి చాలా బాగుంటుంది. గుడి వెలుపల పెద్ద కోనేరు కూడా చాలా బాగుంటుంది. గుడి గోపురం, ఆలయం గోడల మీదా, కోనేరు మెట్ల మీదా వేసిన రంగులతో… ఈ మొత్తం setting చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది.

నంది హిల్స్, మాగడి కి సంబంధించిన నా ఫోటోలు, slide show గా… మొదట నంది హిల్స్, తరువాత మాగడి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు

5 thoughts on “పర్యాటకం – నంది హిల్స్, మాగడి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s