ప్రాకృతికం – పల్లె అందం

“ణిప్పణ్ణ సస్సరిధ్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు.”

శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజు చే సంకలించబడిన గాథా సప్తశతి అనే పేరున్న ప్రాకృత గాథల సంకలన గ్రంథంలో ఏడవ శతకంలోని ఎనభైతొమ్మిదవ గాథ ఇది.

“నిష్పన్న సస్య ఋధ్ధిః స్వఛ్ఛందం గాయతి పామరః శరది,
దలితనవశాలి తండుల ధవల మృగాంకాసు రాత్రిషు.”

అని పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ.

‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు పెద్దలు చెప్పిన అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపెట్టే ఈ గాథను ఎన్ని సార్లు చదివినా, మననం చేసుకున్నా, తనివి తీరనట్లుంటుంది.

అచ్చమైన ఆప్యాయతతో రైతు కాళ్ళకు అంటుకునే పొలంలోని మట్టీ, మట్టిని తడిపి తమకంతో తబ్బిబ్బయ్యే నీరూ, స్వచ్చంగా వీచే గాలీ, రాబోయే పంటమీదా, పచ్చదనం మీదా కారుణ్యంతో కాచే ఎండ, కాలం కనికరించి అన్ని కలిసొస్తే ఏ దిక్కుకేసి చూసిన కళ్ళ నిండుగా కనిపించే పచ్చదనం….ఇవన్నీ పల్లెటూరు అనే పడతికి ప్రకృతి తనంత తానుగా తొడిగి చూపించిన నిలువెత్తు ఆభరణాలు. జీవితంలో ఏ కొంత భాగమైన పల్లెటూరిలో గడపడం అన్నది సంభవించిన ఏ వ్యక్తికైనా వీటి సహజ సౌందర్యం ఏమంత కష్ట పడకుండానే మనసుకు తట్టి కనులకు కడుతుంది.

ఆధునిక జీవన శైలిలో, పొట్టకూటికోసం అనుకున్నా, మరెందుకోసం అనుకున్నా, తనదైన పల్లెటూరిని విడిచి పట్టణానికి వలస వెళ్ళల్సి రావడం సంభవించిన వ్యక్తికి, తలచుకునే సందర్భం దొరికినప్పుడల్లా, వాటి సహజ సౌందర్యం మనసును పూర్తిగా కమ్మేసి, ఆ దృశ్యాలను విడిచి పెట్టి  ప్రస్తుతంలోకి రావడానికి ఒక పట్టాన ఇష్టపడక మనసు మొరాయిస్తూనూ వుంటుంది.  తప్పనివి అయినా కాకపోయినా, తెచ్చిపెట్టుకున్నవి అయినా కాకపోయినా….ఈ వియోగాలు ఇప్పటి జీవితంలో తప్పించుకోలేని అంతర్భాగాలయిపోయాయి. అంగీకరించాలిసిందే తప్ప, అందులో బాధపడాలిసింది కూడా ఏమీ లేదనే అనుకోవాలి!

పల్లెటూరితో సంబంధం వున్నవాళ్ళు మరోసారి ఆ సౌందర్యాన్ని మననం చేసుకోవడానికి వీలుగానూ, సంబంధం లేని వాళ్ళు ఆ సౌందర్యాన్ని మరోసారి చూడడానికి వీలుగానూ, నా ఫోటోలు కొన్ని slide show గా…. ఇప్పుడు, ఇక్కడ! ఇక్కడ ఒక్క మాట! ఈ ఫోటోలన్నీ బస్సులో ప్రయాణిస్తూ తీసినవి. అందువలన, అక్కడక్కడా ఒకటి రెండు ఫోటోలు straight గా వుండకుండా, కొంచెం angled గా కనిపిస్తాయి. అయితే, angled గా వున్నా, అందులో వున్నది ప్రకృతి  కాబట్టి, వాటి సౌందర్యానికి ఏమీ భంగం కలగలేదనే అనుకుంటాను!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు

8 thoughts on “ప్రాకృతికం – పల్లె అందం

  1. చాలా బాగున్నాయండీ మీ ఫోటోల స్లైడు దానితో బాటు గాధాసప్తశతి కూడాను !

    ఏ ప్రాంతపు ఫోటోలు ఇవి ( ఆంధ్ర దేశమే అనుకుంటాను అందులో ఈ ప్రాంతంవి?)

    జిలేబి.

    • ధన్యవాదాలు ‘జిలేబి’ గారూ! ఆంధ్ర దేశానివి కాదు. కర్ణాటక రాష్ట్రానివి. బెంగళూరు నుంచి సోమనాథపూరు ప్రయాణంలో, మాండ్యా అనే వూరు దాటిన తరువాత సోమనాథపూరు చేరే దాకా మధ్యలో రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలు…ఆ ఫోటోలు ఇవి! ఆంధ్ర దేశంలో విజయవాడ దాటాక విశాఖపట్నం చేరే దాకా రైల్వే ట్రాక్ కు ఇరు వైపులా ఇలానూ, కొన్ని కొన్ని చోటల ఇంకా బాగానూ వుంటుంది పంట పొలాల పచ్చదనమూ, ప్రకృతి విన్యాసమూను!

      వెంకట్.బి.రావు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s