ఫోటోగ్రఫీ : Images 2012 – మధువ్రత

ఈ పోస్టు ఇలా తయారవుతుందని ఊహించలేదు! మొదటగా, ఫోటోగ్రఫీ మీద వున్న ఆసక్తితో ఒక ఆదివారం నాటి ఉదయం ఏ expectations లేకుండా బయలుదేరితే by chance గా అన్నట్లుగా దొరికినవి మధుపం ఫోటోలు! అనుకున్న quality కి ఒకింత దగ్గరగానే వున్నాయనిపించి బ్లాగులో పెట్టడం అన్నది మొదటి దశ! అదయిపోయాక, ఇంకా ఏదో వెలితిగా అనిపించడంతోనూ, ఆ quality ఫోటోలకు ఇంకా అనుకున్నంత న్యాయం జరిగినట్లుగా అనిపించక పోవడంతోనూ, ఈ ఫోటోలనే relevant సమాచారంతో ఇంకా అందంగా ముస్తాబు చేసి పోస్టు చేయాలన్నతలపుతోనూ సమాచారం కోసం వెదికితే దొరికిన సమాచారం వల్ల తెలిసిన విషయాలు ‘ఔ(రా)నా!’ అంపించేంత ఆసక్తికరంగానూ, అక్కడక్కడా ఆశ్చర్యకరంగానూ వుండడంతో, (చెప్పాలంటే reverse order లో), తయారయినది ఈ పోస్టు!

మనం బయట చూసే తేనెటీగలు అన్నీ, gender పరంగా చెప్పాలంటే స్త్రీ జాతికి చెందినవి. తేనెటీగలకు సంబంధించిన, నాకు ఇంతవరకూ తెలియని, ఇది మొట్టమొదటి basic నిజం! దీనికి కారణం ఏమిటంటే, పురుష జాతి (అంతే మగ) తేనెటీగలు మహా సోమరివి. ఇవి ఇలానే సృష్టించబడినాయి. ఎంత సోమరివి అంటే, ఇవి ఎప్పుడూ తేనెపట్టును వదిలి వెలుపలికి వెళ్ళవు. ఇంకా చెప్పాలంటే (ఈ పురుష జాతి తేనెటీగలకు) వాటికి కావలసిన ఆహారం తీసుకోవడం కూడా సరిగా తెలియనంత, పట్టించుకోనంత సోమరివి!  ఇవి ఎప్పుడూ తేనెపట్టును వదలవు. వాటి మనుగడ అంతా తేనెపట్టులోనే! తేనెపట్టులో వాటి ముఖ్యమైన ఉపయోగం reproduction లోనే! ఆ ఉపయోగం పూర్తి అయ్యాక వాటి జీవితమూ ముగుస్తుంది. నిర్జీవమైన వాటి అవశేషాలు తేనెపట్టు నుంచి నెట్టివేయబడతాయి!

ఒక తేనెపట్టులో దాదాపు నలభై వేల నుంచి అరవై వేల వరకూ తేనెటీగలు వుంటాయట! ఇందులో అత్యధికంగా, అంటే దాదాపు 80% వరకూ వుండేవి పనిచేసే స్త్రీ జాతి తేనెటీగలే! ఆరు నెలలనుంచి ఎనిమిది నెలల వీటి జీవిత కాలంలో ఇవి ఒక్క క్షణం కూడా నిద్ర పోవు. ఇంత తక్కువ కాలం మాత్రమే ఇవి జీవించి వుండడానికి వాటి జీవిత కాలం మొత్తంలో అవి నిద్రంటూ పోకపోవడం కూడా కారణం కావచ్చని చెబుతారు.

ఒక తేనెపట్టుకు ఒకటే రాణి ఈగ వుంటుంది. ఇది అందరికీ తెలిసినదే! అయితే, ఇందులో చాలమందికి తెలియని నిజం ఏమిటంటే, రాణి ఈగ పుట్టడమే రాణి ఈగలా పుట్టదు. లార్వా దశనుంచే అది రాణి ఈగగా తయారు చేయ బడుతుంది. తేనెపట్టులోని అత్యధిక సంఖ్యలో వున్న పనిచేసే స్త్రీ జాతి తేనెటీగలు రాణి ఈగలుగా కాగలిగిన లార్వాలకు royal jelly అనే పదార్ధాన్ని తినిపించడం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుంది. అయితే, ఈ రాణి ఈగలుగా కాగలిగిన లార్వాలన్ని పెరిగి ఒక దశలో వాటిలో అవే కొట్లాడుకుని, (ఎంతగా అంటే చివరికి ఒకటే మిగిలేటంతగా ఆమీ-తుమీ తేల్చేసుకుని), మిగతావి పోగా, మిగిలిన ఒకే ఒక్కటి రాణి ఈగగా మారుతుంది. ఇది కూడా తేనెపట్టును వదిలి వెళ్ళనే వెళ్ళదు. ఈ రాణి ఈగ పని reproduction ఒక్కటే! ఒక్క రోజులో 2000 గుడ్లను ఈ రాణీ ఈగ పెడుతుంది.

ఇక పనిచేయడమే జీవితంగా వుండే సాధారణ తేనెటీగలే తేనెపట్టుకు ప్రాణం. ఈ తేనెటీగలకు పరిశుభ్రత అంటే మహా ఇష్టం. తేనెపట్టు మూలమూలనూ ఇవి పరిశుభ్రంగా వుంచుతాయి. చూడడానికి పలచగా, బలహీనంగా వున్నట్లనిపించే ఈ సాధారణ తేనెటీగ రెక్కలు సెకనుకు 200 సార్లు కొట్టుకోగలిగే సామర్ధ్యాన్ని కలిగి వుంటాయి. ఇవి గంటకు పదిహేను మైళ్ళు ప్రయాణం చేయగలిగే వేగంతో  ఎగర గలిగే సామర్ధ్యాన్ని కూడా కలిగి వుంటాయి. ఇలా ఎగురుతూ ఒక్కొక్క తేనెటీగ తేనెపట్టు నుంచి దాదాపు ఆరు మైళ్ళ దూరం దాకా వెళ్ళి, మళ్ళీ వెనకకు తన గూటికి, మధ్యలో ఎక్కడా దారి తప్పిపోకుండా,  చేరుకోగలుగుతుంది.

తేనెటీగ ఒకసారి తేనెపట్టును వదిలి వెళ్ళి, పూవుల నుంచి తేనెను సేకరించుకుని తిరిగి తేనెపట్టును చేరుకోవడాన్ని ఒక collection trip అంటారు. ఒక్కొక collection trip లో ఒక తేనెటీగ దాదాపు 50 నుంచి 100 పూవుల మీద వాలుతుంది. పూవులనుంచి మకరందాన్ని సేకరించుకుంటుంది. ఈ ప్రక్రియలో జరిగే ఇంకొక ఉపయోగం pollination, పూవుల మధ్య పరాగ సంపర్కం అనే ప్రక్రియ! ప్రకృతిలో వృక్ష జాతిలో జరిగే ఈ ప్రక్రియలో (insects) కీటకాల వలన జరిగే మొత్తంలో 80% దాకా ఈ తేనెటీగల వలన జరుగుతుందని చెబుతారు. అందువలన, తేనెటీగలకు మనం అవి తయారుచేసి ఇచ్చే తేనె కారణంగానే కాక, వాటి వలన ప్రాకృతికంగా జరిగే వుపయోగం ఫలితంగా మనం తినగలుగుతున్న రకరకాల పండ్ల కారణంగా కూడా ఋణపడి వుండాలి అని చెబుతారు!

ఒక తేనెటీగ దాని జీవితకాలమంతా శ్రమించి తయారుచేయగలిగే తేనె పరిమాణం, కేవలం ఒక టీస్పూనులో 12వ వంతు మాత్రమే! అంటే, మనం ఒకటి రెండు క్షణాల కాలంలో తినేయగలిగే టీస్పూను పరిమాణం తేనె అన్నది 12 తేనెటీగల జీవితకాల శ్రమ ఫలితం అన్నమాట! అదలా వుంచితే, (insects) కీటకాలలో మానవులు తినగలిగే పదార్ధాన్ని తయారు చేసేవి ఒక్క తేనెటీగలే అన్నది నిజం! అలా తయారు చేయగలిగే సామర్ధ్యం ఒక్క తేనెటీగలకు తప్ప మరే జాతి కీటకానికీ లేదన్నదీ అంతే నిజం!

ఇన్ని మంచి లక్షణాల సమాహారం అన్నట్లుగా వుండే ఈ తేనిటీగలకు వున్న మరొక మనసు కరిగింపజేసే మంచి లక్షణం – శ్రమయే సర్వస్వంగా జీవితమంతా గడిపే ఈ తేనెటీగలు, వాటి జీవితం ముగిసే తరుణానికి తప్పనిసరిగా అవి తేనెపట్టుకు వెలుపలే తనువును చాలించడం అన్నది! నిర్జీవమై మిగిలే అవశేషాలతో తేనెపట్టును కలుషితం చేయడం ఈ సాధారణ తేనెటీగలకు ఇష్టం లేని విధంగా వాటి genetic code లోనే వ్రాసి పెట్టబడి వాటి సృష్టి జరిగిందన్నది ఇందులో స్పష్టమవుతుంది.

జీవించి వున్నంత కాలం శ్రమించడమే పనిగా జీవించి, వాటి జీవిత సారాన్ని తేనెగా సేకరించి మనను ఆస్వాదించమని నిక్షిప్తంచేసి వుంచి, చివరికి ఎక్కడో unsung heroes లాగా రాలిపోయే తేనిటీగలు, కీటకాలలో ఉత్తమమైనవి అనడంలో సందేహం లేదు కదా!

ప్రకటనలు

3 thoughts on “ఫోటోగ్రఫీ : Images 2012 – మధువ్రత

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s