ఫొటోగ్రఫీ : Images 2012 – (14)

madhupam 'best'

I consider this photo as one of my best photographs so far! కారణాలు ముఖ్యంగా ఈ ఫోటోలో వున్న color balance and composing balance!

బంగారపు భరిణలో, శింగారించుకుని సిగ్గుపడుతూ కూర్చుని వున్న పెళ్ళికూతురులాగా, కనుపిస్తుంది నాకు ఈ ఫోటోలోని మధుపం! చాలా కష్టం మీద కుదిరినది ఈ composing! కావాలనే ఇరువైపులా చోద్యం చూస్తూ కూర్చుని వున్న చిన్నా పెద్దా పడతుల లాగా, ఒక విరియబోతూన్న మొగ్గనీ, ఒక విరిసి వున్న పూవునూ తోడుంచాను…balancing కోసరం అన్నట్లుగా!

అంతే కాకుండా, సౌందర్యం ఎప్పుడూ, ఎక్కడా కూడా  వేరే ఒక పక్కనుంచి (ఇతరులచే) చూడబడుతున్నట్లుగా కాకుండానూ, ఆశ్చర్య ప్రకటితం కాబడుతున్నట్లుగా కాకుండానూ బారతీయ చిత్రకళలో గానీ, శిల్పంలోగానీ చూపబడని సంధర్భాలు తక్కువ, నేను చూసినంతవరకూ! అలా చూప బడని చిత్రంలోగానీ, శిల్పంలోగానీ దానిని సృష్టించిన చిత్రకారుని యొక్క/శిల్పి యొక్క నమ్మకం  (conviction) కనపడదు అని మన శిల్పుల, చిత్రకారుల అభిప్రాయం  అని నేను అనుకుంటాను! తాను సృష్టించే సౌందర్యానికి తాను ముగ్ధుడవకుండా, తృప్తుడవకుండా ఏ చిత్రకారుడైనా, శిల్పి అయినా ఇతరులను ఎలా సంతోష పరచ గలననీ, ఆశ్చర్య చికితులను చేయగలననీ నమ్ముతాడు? నమ్మలేడు! ఇది సౌందర్యమని మొదటగా తాను నమ్మి, తరవాతనే లోకం ముందు వుంచుతున్నానని చెప్పడానికి ఉద్దేశించినవే శిల్పాలలో గానీ, చిత్రాలలొ గానీ మనకు చిన్న చిన్న ఆకారాలలో ఒక పక్కన ఒదిగి వుండి కనపడే వీక్షకుల బొమ్మలు! ఈ ఫోటోలో మధుపం వాలి వున్న పుష్పానికి ఇరు
వైపులా వున్న మొగ్గ/విరిసి వున్నపుష్పం కూడా ఒకరకంగా అలాంటివే!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s