స్వగతాలు (3) : జ్ఞాపకం

జ్ఞాపకం

ప్రతి జ్ఞాపకానికీ వేలిముద్ర లాంటి ఒక personal ముద్ర వుండడమన్నది వాటి నైజం.

Memory loss అంటే?
జ్ఞాపకం పోవడం….అంతే!

ముఫ్ఫై నలభై ఏండ్లుగా వెంట పడి వున్న ఒక జ్ఞాపకాన్ని
ఎలక్ట్రానిక్ కాగితం మీదికి – అదే కంప్యూటర్ స్క్రీన్ మీదికి – వ్రాయడానికి ఎంత సమయం పడుతుంది?
ఒక గంటా?
రెండు గంటలా?
మూడూ? నాలుగూ? ….. పోనీ ఒక రోజు!

జ్ఞాపకం పోవడం అంటే
ఒక memory మన నుంచి వేరై పోవడం – అంతే!

Memory ని Memory గానే మాటలలో మూట కట్టి బయటికి నెట్టేయడంలో పోయే ప్రతి జ్ఞాపకం, తన వెంట ఒక తనువంత అనుభూతి బరువును తీసుకొని పయనమై పోయినట్లనిపించకపోవడం తెలియకుండా జరిగిపోతుంది.

వ్యక్తి హరువును జ్ఞాపకాల బరువు నిర్ణయించడమన్న తెలియని నిజం, తేలికైపోయిన జ్ఞాపకాల బీరువాలోని చీకటిలోనికి తొంగి చూసుకుని ఒకానొక రోజు తముళ్ళాడుకోవాల్సి రావడం జరిగినప్పుడు, ఒక్కసారిగా తెలిసి భయపెట్టే క్షణం రాకూడదనుకుంటాను!

అన్నీ అయి పోయి

ఎప్పటికైనా సరే, చెప్పడానికి ఇక ఏమీ మిగలకుండా అయిపోయి మిగలడం మాటలలో చెప్పలేనంత misery!

Memory loss అంటే?
శిథిలానికి సిధ్ధమౌతూన్న ఒక ఖాళీ అయిపోయిన గది!

ప్రకటనలు

2 thoughts on “స్వగతాలు (3) : జ్ఞాపకం

  1. శిథిలానికి సిధ్ధమౌతూన్న ఒక ఖాళీ అయిపోయిన గది బాగా చెప్పారు! కాని మన మెదడు సరిగ్గా పని చేస్తున్నంత కాలం కొన్ని జ్ఞాపకాలని అలా పంపించలేం కదా! జ్ఞాపకాల దొంతరలో ఒక సంవత్సరం చేరింది నందన నామ క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రొత్త గది సిద్ధంగా ఉంది! ఉగాది శుభాకాంక్షలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s