చంద్రగిరి!

చంద్రగిరి! చిత్తూరు జిల్లాలో –  ప్రపంచ ప్రసిధ్ధి చెందిన పుణ్య క్షేత్రం, ఆంధ్రుల ఇల వేలుపు, అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలిచే దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ధామం అయిన – తిరుపతి కి 11 కి.మీ. దూరంలో వున్న ఊరు! ఈ ఊరి పేరు వినగానే ఆంధ్రుల చరిత్రలో జగజ్జగేయమానంగా వెలిగిన  విజయనగర సామ్రాజ్యం, ఆ వెంటనే శ్రీ కృష్ణదేవరాయలు, ఆ వెనువెంటనే ఆయనకు పితృసమానుడూ, గురువు అయిన తిమ్మరుసు గుర్తుకు రావడం మామూలే! తిమ్మరుసయ్య ఇక్కడే పుట్టి, విద్యాబుధ్ధులు నేర్చి అంతవాడయ్యాడని ఐతిహ్యం! కృష్ణదేవరాయలు తిరుపతి యాత్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేసేవాడని చెబుతారు.

ఇక్కడ ఇప్పుడు చూడడానికి ఒక రాజమహలు, రాణీ మహలూ ఉన్నాయి. రాజ మహలు మూడు అంతస్తులలోనూ, రాణీ మహలు రెండు అంతస్తులలోనూ ఉంటాయి. రాజ మహలులోనే ఆర్కియాలనీ డిపార్టుమెంటువారు నిర్వహిస్తూన్న మ్యూజియం వుంది.

ఇవి కాక, వీటికి దగ్గరలోనే రోడ్డుకు ఇవతలి వైపున, ఎప్పటిదో… ఇప్పుడు పాడుబడిపోయిన స్థితిలో వున్న ఒక చిన్న దేవాలయము కనిపిస్తుంది. ఎప్పటినుంచి ఈ దేవాలయం ఈ స్థితిలో వుందో తెలీదు.

ఇవి అన్నీ కలిసి వున్న ఒక slide show ఇప్పుడు, ఇక్కడ!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు