ఫొటోగ్రఫీ : images 2012 (53) – “మార్పు!”

“మార్పు!”

ఒక్క రోజులో ప్రకృతి ఎంత మార్పుని కలిగిస్తుంది?…. ఇది చాలా పెద్ద ప్రశ్న, ఊహ కందనంత పెద్ద ప్రశ్న అనిపించవచ్చు. ఇలా కాకుండా, ఒక్క రోజులో ఒక  మొక్క పెరుగుదలలో ఎంత మార్పు కలుగుతుంది? అనుకుంటే! అవును, ఇది కాస్త ఊహకు అందుబాటులో ఉండే ప్రశ్న. Is quantitative imagination possible? Yes, it is possible! కొంత అస్పష్టంగా నైనా సరే!!

అయితే, ఇందులో స్పష్టత కావాలంటే, తేవాలంటే? ఈ మార్పుని document చేయడం అన్నది మార్గం. అది ఏలాగా?  అనుకుంటే, ఇలాగా అని సమాధానంగా, ఈ క్రింది ఫోటోలు…ఒక్క రోజు తేడాలో ఇంచు మించు అదే టైములో (మధ్యాహ్నం పన్నెండూ – ఒంటిగంట మధ్య) తీసినవి.

ఒక రోజు ముందు

change-1

ఒక రోజు తరువాత

change-2

ప్రకటనలు

ఫొటోగ్రఫీ : images 2012 (52) – “ముందూ…వెనుకా…”

“ముందూ…వెనుకా…”

ముందూ….


వెనుకా….

ముందు వెనుకల మధ్యలో….

– and this is all about the (not so) fine art of focusing in (Digital) Photography!!
పై images మీద ఎక్కడైన సరే క్లిక్ చేస్తే, ఆ images ని వాటి full dimensions లో చూడడానికి వీలవుతుంది. అప్పుడు focussing వలన images లో కలిగిన మార్పులు, images లో తేడాలను స్పష్టంగా చూడడానికీ వీలవుతుంది.

ఫొటోగ్రఫీ : images 2012 (51)- లోవెలుగు (లోపలి వెలుగు)

లోవెలుగు (లోపలి వెలుగు)

పూవుకైనా, మరే ఇతర ప్రాణికైనా ఈ లోవెలుగు (లోపలి వెలుగు) సజావుగా ఉండడం ఎంతైనా అవసరం అనుకుంటాను!

ఈ వెలుగు సరిగా ఉన్నంతకాలం అంతా సరిగానే ఉంటుందనుకుంటాను! ఈ వెలుగు క్షీణించడం  మొదలవడంతోనే, వృధ్ధాప్యమూ, క్షీణదశా మొదలవడం
జరుగుతుందేమో, బహుశా, పూవుకైనా….మరే ఇతర ప్రాణికైనా!!

లోపల, తొడెమ నుంచి పూవుగా మొదలైన చోట కాంతివంతంగా మెరవడం, అక్కడి నుంచి వెలుగు రెక్కలపైకి చిమ్మడం (reflect అవడం), అలా చిమ్మిన వెలుగు స్పష్టంగా పూవు రెక్కలపై బిందువులుగా కనిపించడం ఈ పూవులలోనే చూశాను! Very pleasing, eye-catching colors and a heartening phenomenon indeed!!

ఫొటోగ్రఫీ : Images 2012 (49) – “అందం చూడవయా…”

అందం చూడవయా…… ఆనందించవయా…..ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు.

అందం చూడవయా….

ఆనందించవయా…

ఫొటోగ్రఫీ : Images 2012 (48) – “చిటారుకొమ్మన…”

చిటారుకొమ్మన….. చిగురాకులలో….. ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు!

చిటారుకొమ్మన….

bfly images 2012 (18)చిగురాకులలో….

bfly images 2012 (19)

స్వగతాలు (12): పసితనమూ, పోయిన వసంతమూ….

పసితనమూ, పోయిన వసంతమూ….

shades of future-2ఏ అనవసరపు ఆవేశానికీ లోనుకాకుండా
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.
పసితనమూ, వార్ధక్యమూ
పత్రహరితమూ, పోయిన వసంతమూ
అన్నీటినీ ఆ కన్ను అదే కరుణతో వీక్షిస్తుంది.

వెలిగే దీపం చీకటి వాకిట్లో మరీ హుందాగా మెరిసేటట్లుగా
అందం అప్పుడప్పుడూ ఒక్కొక సందర్భాన్నీ అంటిపెట్టుకుని ఉంటుంటుంది.
అందువలన, సౌందర్యాన్ని సృష్టించడమంటే ఎప్పటికప్పుడు సందర్భాన్ని కల్పించడమో, మేలుకొల్పడమో అవుతుంటుంది.

నువ్వు ఉండవు.
అయినా నిన్ను గురించిన సందర్భాలు కొన్నైనా చిత్రాలుగా మారి చిత్తాన్ని అలంకరించి ఉండడమే జ్ఞాపకం.
ఇది సహజం.

నేను ఉంటాను.
అయినా నన్ను గురించిన సందర్భం ఏదీ నీ చిత్తాన్ని  అలంకరించి ఉండకుండడమూ నాకు జ్ఞాపకమే!
అసహజమైనా సౌందర్యమే!

అందుకే అంటాను
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.

అడవి గాచిన వెన్నెలలా, ఎవరికీ చెందని విషాదం కూడా ఒక్కొకప్పుడు మహా సౌందర్యానికి కారణమౌతుందన్నది నిజం!