హొయసలుల దేవాలయం, శిల్పకళ (4)

నాట్యం! ఈ నాట్యం అనేది హొయసలుల దేవాలయాలలోని శిల్పాకృతులలో, ముఖ్యంగా హాలేబీడు హొయసలేశ్వర దేవాలయంలో, ఒక central theme గా కనబడుతుంది. శివాంకితమైనది హాలేబీడులోని హొయసలేశ్వర ఆలయం. నాట్యం శివాంశలో ఒక భాగం! దానికి తగినట్లుగానే హాలేబీడు హోయసలేశ్వరాలయం గోడల వెలుపలి వైపు relief sculpture ఉల్బణ చిత్రాలలో చాలా భాగం నాట్య మయమై కనిపిస్తుంది.

నాట్యం రెండు రకాలు! ఒకటి పరుల ఆనందం కోసం, తెలిసిన విద్యను ప్రదర్శిస్తూ చేసేది. రెండవ రకం తన్మయంలో తన ఆనందంకోసం చేసేది! హాలేబీడు హోయసలేశ్వరాలయం గోడలపై ప్రతిమలలో కనుపించేది చాలా భాగం ఈ రెండవ రకానికి చెందినది. శివుడు, భైరవి నాట్య భంగిమలో వున్న ప్రతిమలలోని సంగతులు (detail) మహాద్భుతంగా మలచబడి కనిపిస్తాయి. శివుడు, భైరవి కాక, మిగిలిన నాట్య ప్రతిమలలో కనుపించేది, శివ సాన్నిధ్యంలో వున్నామన్న, వుండగలిగామన్న తన్మయత్వంలో చేసే సంకీర్తనతో కూడుకున్న నాట్యం!  ఇంతకు మించి ఈ క్రింది ఫోటోలలో కనుపించే సంగతులకు వేరే వివరణ అవసరం లేదు.

హొయసల శిల్పం - 21 (హాళేబీడు)

హొయసల శిల్పం - 22 (హాళేబీడు)

హొయసల శిల్పం - 23 (హాళేబీడు)

హొయసల శిల్పం - 24 (హాళేబీడు)

Hoyasala sculpture 25 (Halebidu)

హొయసల శిల్పం -25 (హాళేబీడు)

గణపతి చేతకూడా అందమైన భంగిమలలో నాట్యం చేయించి చూపించారు హోయసల శిల్పులు!

హొయసల శిల్పం - 26 (హాళేబీడు)

చివరగా, రెండు ఫొటోలను ఇక్కడ present చేస్తున్నాను!  ఈ రెండు ఫోటోలూ సోమనాథపూర్ శ్రీ చేన్నకేశవాలయం లోనివి.  ఈ రెండు ఫొటోలలో హోయసల శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి సంబంధించిన చాలా సంగతులను పట్టుకోగలిగానని అనుకుంటున్నాను!

హొయసల శిల్పం - 27 (సోమనాథపూర్)

Hoyasala sculpture 28 (Somanathpur)

హొయసల శిల్పం - 28 (సోమనాథపూర్)

ధన్యవాదాలు!

ప్రకటనలు

హొయసలుల దేవాలయం, శిల్పకళ (3)

విష్ణుమూర్తి అవతారాలలో, వరాహ, నారసింహ, వామన, శ్రీ కృష్ణ అవతారాలు ఉల్బణ చిత్రాలు (relief sculpture) గా మలచబడి ఎక్కువగా బేలూరు, సోమనాథపూర్ లలోని శ్రీ చెన్నకేశవాలయాలలోనూ, హాలేబీడు హొయసలేశ్వరాలయం గోడలమీదనూ కనిపిస్తాయి.  ఈ అవతారాలలో, నారసింహ అవతారం సాధారణంగా చూసేదిగానే, మన ఊహలలో వున్నట్లుగానే, అత్యంత రౌద్రాకృతిలో మలచబడి కనిపిస్తుంది. అయితే,  వామన అవతారం మామూలుగా మన ఊహలలో వుండే వటువు రూపంలో కాక, విష్ణుమూర్తి పూర్ణాకృతిలో తన మూడవ పాదాన్ని ఎక్కడ నిలపాలన్న చూపుతో ప్రశ్నిస్తున్నట్లుగానూ, ఆ ప్రశ్నకు సమాధానంగా అన్నట్లుగా బలి చక్రవర్తి వినమ్రంగా చేతులు మొగిచి తన శిరస్సుపై నిలపమని సూచిస్తున్న చూపులతో వున్నట్లుగానూ అత్యంత రమణీయంగా మలచబడి కనిపిస్తుంది.

హొయసల శిల్పం - 14 (హాళేబీడు)

హొయసల శిల్పం -15 (బేలూరు)

హొయసల శిల్పం - 16 (హాళేబీడు)

బేలూరు శ్రీ చెన్నకేశవాలయం గోడపై శ్రీ కృష్ణ రూపం పిల్లనగ్రోవిని ఊదుతూన్న మురళీకృష్ణుని రూపం.

హొయసల శిల్పం -1 7 (బేలూరు)

ఇక వరాహ అవతారనికి వస్తే, బేలూరు, హాలేబీడు ఆలయాలలోని వారాహ రూపం ఉగ్రంగానూ భూదేవిని రక్షించి తీసుకు వెళుతూన్న రూపంలోనూ వుంటుంది. సోమనాథపూర్ లోని చెన్నకేశవాలయంలో ఈ వరాహ రూపం సౌమ్యంగానూ భూమిని రక్షించి భద్రంగా తన చేతులలో పట్టుకుని వున్నట్లుగా మలచబడి కనిపిస్తుంది. అయితే, సోమనాథపూర్ లోని చెన్నకేశవాలయం వరాహ రూపంలో గమనించాల్సిన ముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఆయన చేతులలో భూమి ఇప్పుడు scientific గా prove అయిన oval shape లోనే వుండడం, అలానే మలచబడి చూపెట్టబడడం! అన్ని అలంకరణలతో వున్న ఆ రూపాన్ని చూస్తున్నపుడు నయనానందకరంగానూ, మనసుకు ఎంతో ఆహ్లాదంగానూ వుంటుందనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు!

హొయసల శిల్పం -18 (బేలూరు)

హొయసల శిల్పం - 19 (హాళేబీడు)

హొయసల శిల్పం -20 (సోమనాథపూర్)

హొయసలుల దేవాలయం, శిల్పకళ (2)

శిల్పానికి ఆకృతిని ఇవ్వడంలో హొయసల శిల్పులు దేవతా మూర్తుల రూపాలకు చిన్న చిన్న మార్పులు కల్పించి చూపడానికి ఎప్పుడూ వెరవలేదనిపిస్తుంది, వారిచే నిర్మించ బడిన దేవాలయాలలోని కొన్ని దేవతా ప్రతిమలను చూసినప్పుడు! సాధారణంగా విష్ణువు మూర్తిని శేషుని తల్పంగా చేసుకుని శయనించి వున్నట్లుగా చూపించడమే మనం చూస్తాం! అయితే, సొమనాథపూర్ లోని చెన్నకేశవాలయం గోడపై వెలుపలివైపు మలచబడిన శిల్పంలో విష్ణుమూర్తిని శేషునిపై కూర్చుని వున్నట్లుగా మలచబడి వుండడం చుస్తాం! ఇదే దేవాలయం గోడలపై మలచబడిన విష్ణు ప్రతిమలలో విష్ణుమూర్తి శ్రీలక్ష్మి సమేతంగా కూర్చునివున్న ప్రతిమనూ, విష్ణుమూర్తి ఒక్కడుగానే నిలుచుని వున్న ప్రతిమలనుగూడా చూడవచ్చు. అత్యంత సుందరంగా మలచబడిన ఈ ప్రతిమలలోని కొన్ని వివరాలు కాలానికి చెదిరిపోయి కనుపించకుండా పోవడం కొంత బాధను కలిగించే అంశం!

Hoyasala sculpture -10 (Somanathpur)

హొయసల శిల్పం – 10 (సోమనాథపూర్)

Hoyasala sculpture - 11 (Somanathpur)

హొయసల శిల్పం – 11 (సోమనాథపూర్)

Hoyasala sculpture -12 (Somanathpur)

హొయసల శిల్పం – 12 (సోమనాథపూర్)

విష్ణుమూర్తి ప్రతిమలో శంఖ చక్రాలను, మూర్తికి కుడివైపు చేతులలోని ఒక చేతిలోనూ (చక్రం), ఎడమవైపు చేతులలోని ఒక చేతిలోనూ (శంఖం) మలచబడి వుండడాన్ని సాధారణంగా చూస్తాం! ఇది సంప్రదాయకంగా వస్తూన్న సంగతి. అయితే, హాళేబీడు హొయసలేశ్వర దేవాలయం గోడపై మలచబడి వున్న ఒక విష్ణుమూర్తి ప్రతిమలో (ఈ క్రింది ఫోటోలో) శంఖ చక్రాలను రెండింటినీ ఒకేవైపున్న చేతులలో (ఇక్కడ మూర్తికి ఎడమ వైపున్న చేతులలో) మలచబడి కనిపిస్తాయి. ఇది ఇప్పుడు చూడడానికీ, చెప్పడానికీ ‘ఇదేముంది? అటువైపు మలచాల్సింది, ఇటువైపు మలిచారు, అంతేగా!’ అనిపించవచ్చు. కానీ, ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించే ప్రథాన శిల్పాచార్యునికి దృష్టిలో ఇది అంత స్వల్ప విషయం కాదు. సంప్రదాయంగా వస్తూన్న సంగతిని వీడి వెళ్ళడం, అంటే సంప్రదాయానికి విరుధ్ధంగా వెళ్ళడం, break చేయడం, అంత చిన్న విషయాలేమీ కావు. అయినా ఇక్కడ అలా మలచబడి కనిపిస్తుందంటే, దానికి అర్ధం ‘హొయసల శిల్పులు చిన్న చిన్న మార్పులు చేయడానికి, కల్పనలను చేయడానికీ తగిన స్వాతంత్ర్యం ఇవ్వబడినారనీ! Sculptors of this period, the Hoyasala period, had been given ample freedom to think a bit differently, freedom to imagine a bit differently and freedom to execute a bit differently!’ అని అర్ధం. వారు మలచి చూపించిన శిల్పాకృతులలాగా, వారికి ఈయబడిన ఈ స్వేఛ్ఛను వారు అంతే అందంగా వినియోగించుకున్నారన్నది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం!

Hoyasala sculpture - 13 (Halebidu)

హొయసల శిల్పం – 13 (హాళేబీడు)

పై ఫొటోలోని ప్రతిమలలో ఇంకొక విశేషం వుంది. విష్ణుమూర్తి ప్రతిమకు కుడి వైపున వున్న శివుని ప్రతిమలో, శివునికి ఎడమవైపు చేతులలోని ఒక చేతిలో ‘మొక్కజొన్న పొత్తు’ (cob) ని మలచి చూపడం జరిగింది. ఇది కూడా హొయసల శిల్పుల అందమైన కల్పనకూ, imagination కీ, ఒక ఉదాహరణగా నేను భావిస్తాను!

హొయసల శిల్పుల శిల్పాలలోని స్త్రీ ప్రతిమలలో ఈ ‘మొక్కజొన్న పొత్తు’ (cob) విశేషంగా కనిపిస్తుంది. దీనిని వారు స్త్రీ ప్రతిమలలో bountiness of food, bountiness of reproductive capacity అనేవి చూపడానికీ, symbolic గా తెలియజేయడానికి ఉద్దేశించినవని పెద్దలు చెబుతారు. అంతవరకూ బాగానే వుంది. అయితే ఇది ఇక్కడ శివుని ప్రతిమలో ఎందుకు ప్రత్యక్షమైంది? అనేది ప్రశ్న. దానికి నేను వూహించుకున్న సమాధానం ఇది. శివుడు అర్ధనారీశ్వరుడు.  ఆయనలో సగ భాగం, అంటే వామ భాగం (ఎడమ సగం) పార్వతీ దేవి అన్నది అందరకూ తెలిసినదే! ఇక్కడ, శివుని అర్ధనారీశ్వరునిగా మలచక పోయినా, ఆయనలో సగం ఎప్పటికీ (ఆయన పురుషాకృతిలో కనిపిస్తున్నప్పటికీ కూడా) పార్వతీ దేవి అని చెప్పడానికి సూచకంగా, ఈ శివుని ప్రతిమలోని ఎడమవైపు చేతులలోని ఒక చేతిలో ఈ ‘మొక్కజొన్న పొత్తు’ (cob) అలంకరించబడి మలచబడింది అని నేను అనుకుంటాను. ఇది కూడా ఈ ప్రతిమను మలచిన శిల్పి ఊహా శక్తికీ, అందమైన కల్పనకూ ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తాను!

హొయసలుల దేవాలయం, శిల్పకళ (1)

హొయసల శిల్పం అనగానే ముందు స్ఫురణకు వచ్చేది ‘detail’; శిల్పంలో చిన్న చిన్న సంగతులను సైతం వాళ్ళు పలికించిన తీరు, చూపించడానికి వాళ్ళు తీసుకున్న శ్రధ్ధ (పడిన కష్టం ఎంతో? మరి మనకైతే ఇప్పుడు తెలీదు, ఊహించనూలేం!). దేవాలయంలోని ఏ భాగాన్నయినా సరే, శిల్పాన్నయినా సరే, వాళ్ళు కాయితం మీద drawing లాగా చెక్కి చూపించడానికి ఉబలాట పడ్డారు, కృతకృత్యులయ్యారు కూడా! రాతిపై చెయ్యి, చేతిలోని ఉలి అంత precision తో ఎలా తిరిగిందో, ఎలా తిప్పడం సాధ్యమయిందో దేముడికే తెలియాలి అన్నట్లుగా వుంటాయి వారు చెక్కి చూపించిన ప్రతిమలు!

ఆలయ నిర్మాణంలో హొయసలులు అవలంబించిన ఒక పధ్ధతి ఏమిటంటే, ప్రధాన ఆలయానికి ప్రవేశ ద్వారాలు ఎన్నివైపుల వున్నా కూడా, అన్ని వైపులా ప్రవేశ ద్వారానికి దారి తీసే మెట్లకి ఇరు వైపులా చిన్న చిన్న ద్వారపాలక/ద్వారపాలిక ఆలయాలను నిర్మించడం, అందులో అంతే శ్రధ్ధతోనూ, సంగతులతోనూ తీర్చబడిన ద్వారపాలక ప్రతిమలను వుంచడం. బేలూరు శ్రీ చేన్నకేశవాలయంలో ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఈ చిన్న ఆలయాలలో వుంచబడిన ద్వారపాలక/ద్వారపాలిక ప్రతిమలు కూడా అత్యంత నైపుణ్యవంతంగా తీర్చబడి కనిపిస్తాయి. బేలూరు శ్రీ చెన్నకేశవాలయం ప్రధాన ఆలయం ప్రధాన ద్వారనికి దారితీసే మెట్లకు ఇరువైపులా వున్న ద్వారపాలక ఆలయాలలో వున్న ప్రతిమలు శైవ సాంప్రదాయంలోనివి. మిగిలిన ద్వారాలకు వున్న ద్వారపాలక ఆలయాలలోనివి వైష్ణవ సాంప్రదాయంలోనివి. ప్రతిమలను చూడంగానే సులభంగా ఈ సంగతి గుర్తించడానికి వీలవుతుంది.

హొయసల శిల్పం -1 (బేలూరు)

హొయసల శిల్పం -2 (బేలూరు)

హొయసల శిల్పం -3 (బేలూరు)

హొయసల శిల్పం -4(బేలూరు)

‘ఎల్లవేళలా సంతోషంగా వుండడానికి ప్రయత్నించండి, (మన) లోపలి సంతోషానికీ, inner peace కీ సూచకంగా చిరునవ్వును పెదవులమీదనుంచి తొలగనివ్వకండి!’ అని ఇప్పటి art of living భాషణల్లో పదే పదే చెప్పబడుతున్న మాట! ఈ భాషణల్లో, ఈ సూత్రం ఇప్పటి కాలపు ఆధునిక జీవితంలోని ఒడిదుడుకులను సమర్ధవంతంగా తట్టుకోవడానికి కొత్తగా కనిపెట్టబడినది అన్నట్లుగా అర్ధం స్ఫురిస్తూ వుంటుంది గానీ, నిజానికి ఈ management సూత్రం మనకు ముందునించీ వున్నదే! ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పరిస్థితులు అప్పడులేని కారణంగా  అది అలా unspoken గా వుండిపోయింది. ఇప్పుడు ఘర్షణతో కూడుకున్న అలాంటి పరిస్థితులు వున్నాయి కాబట్టి, outspoken గా పదే పదే వక్కాణించబడుతోంది.

రాతిమీద ప్రతిమనుకూడా  ముడుచుకుని వున్న పెదవులతోనూ, నవ్వు విలసిల్లని ముఖ కవళికతోనూ మలిచి చూపించడానికి హొయసలులు ఇష్టపడలేదని చెప్పడానికి వారిచే నిర్మించబడిన దేవాలయాలలో చాలా నిదర్శనాలు దొరుకుతాయి. పెదవులపై కనుపించీ కనుపించకుండా వుండే నవ్వు లేని ప్రతిమ, వారి శిల్పాలలో చాలా అరుదు. ఉగ్ర రూపంలో వున్న శివాంశతో వున్న  పురుష, స్త్రీ ప్రతిమలలోనూ, ఉగ్ర నరశింహ అవతార ప్రతిమలలోనూ తప్ప, చిరునవ్వుతో లేని ప్రతిమలు హొయసలుల శిల్పాలలో సాధారణంగా  కనుపించవు. కనుపించీ కనుపించకుండా వుండే ‘పెదవుల చివరి పైవైపుకి వంపు’ శిల్పానికి ఎక్కడలేని శాంతిని, చిద్విలాసాన్నీ ప్రసాదిస్తుంది అనడానికి ఈ క్రింది ఫొటోలలొ కనుపించే శిల్ప ప్రతిమలు కొన్ని ఉదాహరణలు.

హొయసల శిల్పం - 5 (సోమనాథపూర్)

హొయసల శిల్పం -6 (సోమనాథపూర్)

హొయసల శిల్పం - 7 (హాళేబీడు)

వైవిధ్యం, అంటే ఒకే ప్రతిమను వివిధ భంగిమలలో, ఒక ప్రతిమతో వేరొక ప్రతిమకు ఎటువంటి పోలికా లేకుండా, ఎంత నైపుణ్యంతో నయితే మలచి చూపించారో, అంతే నైపుణ్యంతో ఒక ప్రతిమను అచ్చు గుద్దినట్లు అదే పోలికలతో పక్క పక్కనే మలచి చూపించారు హొయసల శిల్పులు. ఈ క్రింది ఫోటోలలోని మొదటి ఫోటోలో, పక్క పక్కనే మలచబడి వున్న మువ్వురు స్త్రీ ప్రతిమలలో ఏ ప్రతిమకూ మరొక ప్రతిమతో ఏ పోలికా లేక పోవడాన్ని గమనించవచ్చు. అలాగే, రెండవ ఫోటోలో, ఆసీనులైవున్న ‘విష్ణుమూర్తి శ్రీ లక్ష్మి’ ప్రతిమలకు ఇవువైపులా వింజామరలతో నిలబడివున్న స్త్రీ ప్రతిమలు, ఒక ప్రతిమకు వేరొకటి అచ్చు గుద్దినట్లు అదే పోలికతో మలచబడి వుండడమూ చూడవచ్చు.

హొయసల శిల్పం -8 (బేలూరు)

హొయసల శిల్పం -9 (బేలూరు)

 

 

చాయా చిత్రం (5)

హొయసలుల దేవాలయం (3)

హొయసలుల ఆలయ నిర్మాణ శైలిని పట్టి చూపించేవి మరో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో మొదటిది – ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయాన్ని ‘జగతి ‘ అనే ఒక ఎత్తైన నక్షత్రాకారపు పీఠం పైన నిర్మించడం అనేది. ‘జగతి’ వలన వొనగూడే మరో ముఖ్యమైన ఉపయోగం, ఇది ఆలయం చుట్టూ ప్రదక్షిణ పథంలా కూడా ఉపయోగపడుతుంది. ‘జగతి’ పైకి వెళ్ళడానికి మెట్లు ఉండడం, మెట్లకు ఇరువైపులా ద్వారపాలకులు ఉండడం, వారి వసించి ఉండడానికి అన్నట్లుగా చిన్నచిన్న గుడులుండడం, ముందు వైపు నుంచే కాక, కుడి ఎడమ పక్కల నుంచి కూడా మెట్ల మీదుగా జగతి పైకి వెళ్ళ గలిగే సౌకర్యాన్ని కల్పించడం, ఇలా ఉన్న ప్రతి చోటా ద్వారపాలకులు, వారికోసం చిన్న చిన్న గుడులూ ఉండడం – ఇలా చేసిన నిర్మాణాలు మొత్తం కలిసి ప్రధాన దేవాలయానికి ఒక నిండైన రూపాన్ని ఇవ్వడం హొయసలుల కాలంలో నిర్మితాలయిన దేవాలయాలలో చూడవచ్చు.

చిత్రం (15): జగతి నిర్మాణంపై చెన్నకేశవాలయం - సోమనాథపూరు

చిత్రం (16): ద్వారపాల ఆవాస గోపురం - చెన్నకేశవాలయం, బేలూరు

చిత్రం (17): ద్వారపాలిక - చెన్నకేశవాలయం, బేలూరు

చిత్రం (18): ద్వారపాలకుల ఆవాస గోపురాలు - చెన్నకేశవాలయం, బేలూరు

చిత్రం (19): ద్వారపాలిక - చెన్నకేశవాలయం, బేలూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హొయసలుల కాలంలో నిర్మించబడిన ఆలయాలను చూసిన ఎవరికైనా, హొయసల శిల్పులకు నక్షత్రాకృతి పై ఎంతగానో మక్కువ అన్నది అర్ధమవుతుంది. ఆలయంలో ఏ మూలను చూసినా నక్షత్రాకృతి ఏదో రూపంలో దర్శనమిస్తుంది. గోపురాన్ని కూడా నక్షత్రాకృతిలో మలచడాన్ని చూస్తాం.

చిత్రం (20): చెన్నకేశవాలయం - సోమనాథపూరు

చిత్రం (21): సోమనాథపూరు చెన్నకేశవాలయ గోపుర చిత్రం

చిత్రం (22): సోమనాథపూరు చెన్నకేశవాలయంలో ఒక మూల

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

దేవాలయం మొదలు నుంచి శిఖరం దాకా నక్షత్రాకృతిలోనే శిల్పాన్ని కొనసాగించి దేవాలయం మొత్తానికి ఒక అందమైన రూపాన్ని ఇవ్వడంలో హొయసల శిల్పులు బహుశః వారు నిర్మించిన దేవాలయాలు కూడ భూమి మీద నక్షత్రాల లాగా కలకాలం మెరుస్తూ ఉండిపోవాలని ఆశించారేమో అనిపిస్తుంది.

ఛాయా చిత్రం (4)

హొయసలుల దేవాలయం (2)

ఆలయ నిర్మాణంలో హొయసలులది ఒక ప్రత్యేకమైన శైలి. వారి శైలికి అలంకరణ పట్టుగొమ్మ లాంటిదని చెప్పవచ్చు. కాలి గోటితో సహా అత్యంత సూక్ష్మమైన వివరాలు కూడా రాతిపై మలచి చూపించిన నైపుణ్యం హొయసలుల కాలంనాటి శిల్పులది. శిల్పంకోసం వారు ఎంచుకున్న chloritic schist  (soft soap-stone) అనే రకపు రాయి హయసల శిల్పుల శిల్పకళా నైపుణ్య ప్రదర్శనకు ఎంతగానో సహాయ పడిందని చెబుతారు. కర్ణాటక రాష్ట్రంలోని ‘మల్నాడు’ ప్రాంతంలో ఈ రాయి విరివిగా లభ్యం కావడం ఆలయ నిర్మాణంలో హొయసల శిల్పులు ఈ రకపు రాయిని వాడడానికి దోహదం చేసిన కారణాలలో ఒకటి. తవ్వి తీసినపుడు మెత్తగా ఉండి, భూమి ఉపరితల వాతావరణంలో కాలం గడిచే కొలదీ ఇనుములా గట్టిపడిపోయే లక్షణం ఈ రకపు రాతిది. ఈ లక్షణాన్ని అనువుగా మలచుకుని,  అనన్య సామాన్యమైన రీతిలో శిల్పాలను మలచి చూపించారు హొయసల శిల్పులు.

చిత్రం (7): బేలూరు చెన్నకేశవాలయంలోని ఒక స్తంభం పై అలంకరణ

చిత్రం (8): బేలూరు చెన్నకేశవ దేవాలయ గోడపై ఒక యుధ్ధ సన్నివేశ శిల్పం

చిత్రం (9): బేలూరు చెన్నకేశవ దేవాలయం గోడపై స్త్రీ అలంకరణ శిల్పాల వరుస

చిత్రం (10): నంది - హాలేబీడు హోయసలేశ్వరాలయం

చిత్రం (11): హాలేబీడు హోయసలేశ్వరాలయం గోడపై కుమారస్వామి, గణనాధ శిల్పాలు

చిత్రం (12): అంబ, భైరవి, దుర్గ - హాలేబీడు హోయసలేశ్వరాలయం

చిత్రం (13): సోమనాథపూర్ చెన్నకేశవాలయం

చిత్రం (14): సోమనాథపూర్ చెన్నకేశవాలయం గోడపై శిల్పాల వరుస

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                                                                                         

శిల్పాన్ని అలంకరించి చూపడంలో హొయసల శిల్పుల తరువాతనే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది వారి శిల్ప రచన. అందమైన అలంకరణతో నింపబడకుండానూ, మలచబడకుండానూ దేవాలయంలో ఎక్కడా ఒక్క అంగుళం మేర ప్రదేశం కూడా కనబడదు అన్నట్లుగా ఉంటుంది.  దేవాలయ ప్రాంగణమంతటా ఎటుచూసినా సరే సౌందర్యమే కనబడేలా చేసి సందర్శకులను దైవ దర్శనానికి ప్రసన్నమైన మనఃస్థితితోనూ, ప్రశాంత చిత్తంతోనూ పంపించడాన్ని వారు తద్వారా ఆశించారనుకోవడంలో తప్పులేదనుకుంటాను.

ఛాయా చిత్రం (3)

హొయసలుల దేవాలయం (1)

ఆలయ నిర్మాణంలోనూ, తత్సంబంధ శిల్పకళలోనూ హొయసలులది ఒక ప్రత్యేకమైన శైలి. ఇప్పుడు ‘కర్ణాటక’ గా పిలవబడుతున్న ప్రాంతాన్ని హొయసలులు క్రీ.శ.1000-1346 మధ్య కాలంలో, దాదాపు 350 సంవత్సరాల కాలం పరిపాలించారు. స్వతంత్ర రాజవంశం కావడానికి ముందు వీరు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా వుండి, క్రీ.శ.1117 లో తమకు తాముగా స్వతంత్రాన్ని ప్రకటించుకుని రాజ్యాధికారాన్ని చేపట్టారు. వీరిలో మొదటి స్వతంత్ర రాజు  విష్ణువర్ధనుడు, క్రీ.శ.12వ శతాబ్దం ప్రథమ దశకంలో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈయన పరిపాలనా కాలంలో నిర్మించబడిన ఆలయం, బేలూరులోని చెన్నకేశవాలయం. ఈ దేవాలయం క్రీ.శ.1117 సం.లో పశ్చిమ చాళుక్యుల నుంచి హొయసలులు స్వతంత్రులైన విజయానికి చిహ్నంగా నిర్మించబడి, విష్ణువర్ధన మహారాజుచే ప్రారంభించబడినదని చెబుతారు. బేలూరు చెన్నకేశవాలయం  హొయసలుల ఆలయ నిర్మాణ శైలికి  నమూనాలుగా చెప్పే మూడు దేవాలయాలలో ఒకటి, మొదటిదీను. మిగతా రెండూ, హాలేబీడు లోని హొయసలేశ్వర/కేదారేశ్వర ఆలయాలు, సోమనాథపూరు లోని మరో చెన్నకేశవాలయం.

చిత్రం (1) : బేలూరు చెన్నకేశవాలయం ఆలయ శిఖరద్వారం, ఆవరణ, ధ్వజస్తంభం

చిత్రం (2): బేలూరు చెన్నకేశవాలయం ముఖ్య దేవాలయం ప్రొఫైల్ చిత్రం

చిత్రం (3): బేలూరు చెన్నకేశవాలయం ఆవరణలో కొంత భాగం

చిత్రం (4): బేలూరు చెన్నకేశవాలయం లో హొయసల చిహ్న శిల్పం

చిత్రం (5): హాలేబీడు హొయసలేశ్వర దేవాలయ ప్రాంగణం

చిత్రం (6): సోమనాథపూర్ చెన్నకేశవాలయం 'front view'

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హొయసలులు వారు పరిపాలించిన మూడున్నర శతాబ్దాల కాలంలో మొత్తంగా 958 ప్రదేశాలలో దాదాపు పదిహేను వందలదాకా ఆలయాలు నిర్మింపజేశారని చెబుతారు. ఈ దేవాలయాలలో చాలాభాగం కర్ణాటక రాష్ట్రంలోని ‘మల్నాడు’ గా పిలవబడే ప్రాంతంలో నిర్మింపజేశారనీ, కాలగతిలో పోయినవి పోగా వీటిలో ఇప్పటికి దాదాపుగా ఒక వంద దాకా దేవాలయాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ చెబుతారు.